Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

29-Jun-2017 15:13:34
facebook Twitter Googleplus
Photo

అమెరికా మినహా మిగతా దేశస్థులకు ఎప్పుడూ ఓ అనుమానం వెంటాడుతూ ఉంటుంది. అంతరిక్షంలోంచి వచ్చే ప్రమాదాలు.. అలాగే ఏలియన్స్ (గ్రహాంతర వాసులు) అన్నీ అమెరికా పైనే ఎందుకు దాడి చేస్తాయో అర్ధం కాని విషయం. అలాగే ఇతర దేశాలలో రూపొందే సినిమాల్లో కూడా ఎలియెన్ థీమ్స్ తక్కువగానే ఉంటాయి.

మన దేశంలో కూడా ఇలాంటి ఏలియన్స్ పై సినిమాలు వచ్చాయి. హృతిక్ రోషన్ నటించిన కోయి మిల్ గయా.. అక్షయ్ కుమార్ నటించిన జోకర్.. ఆమిర్ ఖాన్ నటించిన పీకే.. వీటన్నిటిలోనూ ఏలియన్స్ ఇండియాకి వస్తాయ్ కానీ.. ఇవన్నీ మంచి ఏలియన్స్ మాత్రమే. ఇప్పటివరకూ ఒక్క చెడు ఏలియన్.. అంటే ఏలియన్ రూపంలో ఉన్న ఒక్క విలన్ కూడా ఇండియన్ స్క్రీన్ పైకి రాలేదు. ఆ లోటును తీర్చేయబోతున్నాడు అక్షయ్ కుమార్. కమర్షియల్ సినిమాల శిల్పి శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న 2.0 మూవీలో అక్షయ్ కుమార్ పాత్ర ఎలియన్ అని తెలుస్తోంది.

ముందుగా అనుకున్నట్లు కాకి రూపం కాదని.. ఎలియన్ వికృత రూపం ఇదని అంటున్నారు. అలాగే ఈ ప్రపంచం కేవలం మనుషులకే కాదు అనే ట్యాగ్ లైన్ కూడా ఈ రూమర్ కు బలాన్ని ఇస్తోంది.

,  ,  ,  ,  ,