Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

15-Feb-2017 12:09:11
facebook Twitter Googleplus
Photo

సీనియర్ హీరోలు నలుగురిలో వెంకటేష్ గతంలో బాగా స్పీడ్ గా సినిమాలు పూర్తి చేసేసేవాడు. ఇప్పుడు మాత్రం వెంకీ సినిమాల కౌంట్ తగ్గింది.. ప్రాజెక్టులు కూడా వివాదాల్లోకి ఇరుక్కుంటున్నాయి. తాజాగా తన ల్యాండ్ మార్క్ మూవీ అయిన 75వ చిత్రాన్ని దర్శకుడు క్రిష్ చేతిలో పెడదామని భావించాడు వెంకీ. గౌతమిపుత్ర శాతకర్ణితో నందమూరి బాలకృష్ణ ల్యాండ్ మార్క్ మూవీ అయిన వందో చిత్రాన్ని డీల్ చేసిన విధానం బాగా నచ్చడంతోనే.. వెంకటేష్ ఈ డెసిషన్ తీసుకున్నాడన్నారు.

అందుకు తగ్గట్లుగానే వెంకీతో సినిమాపై క్రిష్ టీం నుంచి కూడా క్లారిటీ వచ్చింది. ఫిలిం ఛాంబర్ లో వీళ్లు రిజిస్టర్ చేయించిన టైటిల్ వీరయ్య వెంకీ చిత్రం కోసమే అని భావించారు. అయితే.. ఈ మూవీ కథ ఇప్పుడు కాపీరైట్ వివాదంలో చిక్కుకుందట. ఇప్పటికే ఈ కథకు సంబంధించిన రైట్స్ వేరే డైరెక్టర్ దగ్గర ఉండడంతో.. ఈ ప్రాజెక్టు క్యాన్సిల్ చేసుకుని.. తన 75వ సినిమాని పూరీకి ఇచ్చేశాడనే టాక్ వినిపిస్తోంది.

గతంలో కూడా మారుతితో వెంకీ తీయాలని భావించిన మూవీ రాధా. అనౌన్స్ మెంట్ కూడా వచ్చాక.. సురేంద్ర కృష్ణ అనే రైటర్ ఈ స్టోరీ నాదని కంప్లెయింట్ చేయడంతో.. ఆ ప్రాజెక్టు పక్కన పెట్టి బాబు బంగారం చేశారు వీరిద్దరు. ఇప్పుడు మరోసారి కాపీ వివాదమే వెంకీని మరో ప్రాజెక్టుకు దూరం చేయగా.. స్టార్ హీరో ల్యాండ్ మార్క్ మూవీ చేసే ఛాన్స్ పూరీ చేతికి వచ్చిందనే టాక్ వినిపిస్తోంది

,  ,  ,  ,  ,  ,  ,