Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

03-Jan-2017 11:00:33
facebook Twitter Googleplus
Photo

మన సినిమాలో కంటెంట్ బాగుండటమే కాదు.. వేరే సినిమాల్లో కంటెంట్ కూడా యావరేజ్ గా ఉంటే.. అప్పుడు బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం మామూలుగా పడదు సుమి. ఇప్పుడు అమీర్ ఖాన్ ''దంగల్'' సినిమా విషయంలో అదే జరుగుతోంది మరి. పదండి చూద్దాం.

ప్రస్తుతం మనం బాలీవుడ్ బాక్సాఫీస్ చూసుకుంటే.. అక్కడ చూడదగిన సినిమాలనేవి కొన్నే ఉన్నాయి. వాటిలో కూడా మాస్ అండ్ ఎంటర్టయిన్మెంట్ లవ్వర్స్ అందరికీ నచ్చే సినిమాలే లేవు. అందుకే ఎమోషన్లతో ఇరగదీసిన ''దంగల్'' సినిమాకు అందరూ పట్టంకట్టేశారు. అదీ ఏ రేంజులో అంటే.. తొలిరోజు వచ్చింది 29.78 కోట్ల గ్రాస్ కలక్షన్ అయితే.. 10వ రోజు వచ్చింది 31.27 కోట్ల కలక్షన్. ఈ యావత్తూ అమీర్ ఖాన్ అండ్ దర్శకుడు నితీష్ తివారి గొప్పతనమే కాని.. పక్కనే ధియేటర్లలో ఏ దిల్ హై ముష్కిల్.. డియర్ జిందగీ.. వజా తుమ్ హో.. వంటి యావరేజ్ సినిమాలే ఉండటంతో.. ఈ ఫీట్ దంగల్ కు చాలా ఈజీ అయిపోయింది.

ఇకపోతే దంగల్ సినిమా ఇప్పటికే టాప్ 5 బాలీవుడ్ వసూళ్ళ క్లబ్బులోకి చేరిపోయింది. పికె (340.8 కోట్లు).. భజరంగీ భాయిజాన్ (321 కోట్లు).. సుల్తాన్ (301.5 కోట్లు).. ధూమ్ 3 (284 కోట్లు) లైఫ్ టైమ్ కలక్షన్లలో టాప్ 4 ప్లేసుల్లో ఉంటే.. ఇప్పుడు దంగల్ 10 రోజుల్లో 270.37 కోట్ల కలక్షన్ తో 5వ పొజీషన్లో ఉంది. చూస్తుంటే 2016లో వచ్చిన సుల్తాన్ కలక్షన్లను బీట్ చేయడం పెద్ద కష్టం కాకపోవచ్చు.

,  ,  ,  ,  ,  ,  ,