Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

30-Aug-2017 16:24:18
facebook Twitter Googleplus
Photo

మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ నటించిన దంగల్ మూవీ ఏ రేంజ్ లో సెన్సేషన్స్ సృష్టించిందో చూశాం. దేశంలోనే అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసిన చిత్రంగా రికార్డ్ సృష్టించింది. ఆ తర్వాత ఈ రికార్డ్ ను బాహుబలి2 దాటేయగా.. చైనాలో చారిత్రాత్మక వసూళ్లు సాధించి.. ఓవరాల్ గా వసూళ్లు సాధించడంలో దంగల్ మళ్లీ టాప్ ప్లేస్ ను అందుకుంది.

అక్కడి సినిమాలకు సమానంగా పెర్ఫామ్ చేయడంతో పాటు.. చైనాలో 100 మిలియన్ డాలర్లు వసూలు చేసిన తొలి విదేశీ చిత్రంగా సెన్సేషనల్ రికార్డ్ కూడా నమోదు చేసుకుంది దంగల్. ఇప్పుడీ సినిమాను హాంకాంగ్ లో రిలీజ్ చేయగా అక్కడ కూడా ఈ సినిమా అదరగొట్టేస్తోంది. ఆగస్ట్ 24న హాంకాంగ్ లో ఈ సినిమా రిలీజ్ కాగా.. పెయిడ్ ప్రివ్యూల రూపంలో 85వేల డాలర్లు వచ్చాయి. శుక్రవారం రోజున 1.09 లక్షల డాలర్లను మాత్రమే కలెక్ట్ చేసి.. కాసిన్ని అనుమానాలు కలిగించినా.. శనివారం నాటికి అన్ని చోట్లా హౌస్ ఫుల్స్ పడిపోయాయి.

శనివారం 2.15 లక్షల డాలర్లు.. ఆదివారం 2.15 లక్షల డాలర్లు వసూలు చేసి.. మొత్తంగా వీకెండ్ వరకే 7.02 లక్షల డాలర్ల మార్క్ ను అందుకుంది.

,  ,  ,  ,  ,