Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

24-Jan-2017 10:36:01
facebook Twitter Googleplus
Photo

బాలీవుడ్ దిగ్గజ నటుడు అమీర్ ఖాన్ తాజాగా నటించిన దంగల్ చిత్రం రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తూ దూసుకెళుతోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర అంశం ఒకటి బయటకు వచ్చింది. ఆదివారం నాటితో ముగిసిన కలెక్షన్ల షీట్ చూస్తే.. ఒక్క ఓవర్సీస్ లోనే రూ.200కోట్లను కుమ్మేసినట్లుగా చెబుతున్నారు.

ఒక భారతీయ సినిమా ఓవర్సీస్ మార్కెట్లో రూ.200 కోట్ల కలెక్షన్ కొల్లగొట్టటం రికార్డుగా అభివర్ణిస్తున్నారు. ఇప్పటికే పలు రికార్డుల్ని బద్ధలు చేసిన ఈ స్పోర్ట్స్ మూవీ.. తాజాగా మరో భారీ రికార్డుకు చేరుగా వచ్చేసినట్లు చెబుతున్నారు. అదివారం ముగిసిన కలెక్షన్ల షీట్ ప్రకారం ఓవర్సీస్ తో కలుపుకొని మొత్తంగా రూ.381.07 కోట్ల కలెక్షన్లు వచ్చినట్లుగా తెలుస్తోంది.

తాజాగా వచ్చిన కలెక్షన్ల రిపోర్టుల నేపథ్యంలో ఈ చిత్ర బిజినెస్ ముగిసే నాటికి రూ.400 కోట్ల మ్యాజిక్ ఫిగర్ ను దాటేస్తుందన్నఅంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఓవర్సీస్ మార్కెట్లో ఇంత భారీ కలెక్షన్లు సాధించిన ఏకైక ఇండియన్ సినిమాగా దంగల్ తిరుగులేని రికార్డును సృష్టించేందుకు సిద్ధమవుతున్నట్లు చెప్పాలి.

,  ,  ,  ,  ,  ,