Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

19-Apr-2016 10:59:21
facebook Twitter Googleplus
Photo

తెలుగు ఇండస్ట్రీలో ఎవరినైనా విమర్శించగల ధైర్యం దర్శకరత్న దాసరి నారాయణరావుకే ఉంది. చిన్నా పెద్దా అని చూడకుండా ఎవరికైనా చురకలు అంటిస్తుంటారు దాసరి. ఆయన తరచుగా సెటైర్లు గుప్పించేది మెగా ఫ్యామిలీ మీద.. ముఖ్యంగా చిరంజీవి మీద. ఐతే చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ తో మాత్రం ఆయనకు మంచి సంబంధాలే ఉన్నాయి. వీళ్లిద్దరూ కలిసి ఓ సినిమా చేయడానికి కూడా రెడీ అవుతున్నారు. ఇలాంటి తరుణంలో పవన్ కు తగిలేలా ఆయన వేసిన సెటైర్ చర్చనీయాంశమవుతోంది.

శ్రీకాంత్ హీరోగా తెరకెక్కిన ?మెంటల్ పోలీస్? ట్రైలర్ విడుదల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన దాసరి మాట్లాడుతూ.. మన తెలుగు సినిమాల దర్శక నిర్మాతలు కథ గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదని.. అనవసరంగా కోట్ల రూపాయలు తగలేస్తున్నారని.. ఫారిన్లో పాటలు తీయడానికి విపరీతంగా ఖర్చు చేస్తున్నారని.. సెట్టింగుల కోసం కూడా అనవసరంగా భారీగా ఖర్చు పెడుతున్నారని దాసరి విమర్శించారు. ఇందులో ప్రతి విమర్శ కూడా పవన్ కళ్యాన్ లేటెస్ట్ మూవీ ?సర్దార్?కు తగిలేదే. ఆ సినిమాలో కథ గురించి తీవ్ర విమర్శలొచ్చాయి. పాటలు ఫారిన్లో తీసుకొచ్చారు. సెట్టింగుల కోసం భారీగా ఖర్చు పెట్టారు. మరి దాసరి పవన్ సినిమాను దృష్టిలో ఉంచుకునే ఈ కామెంట్ చేశారో లేదో కానీ.. ఆ మాటలైతే ?సర్దార్?కు గట్టిగా తాకుతున్నాయి. మరి దీనిపై పవన్ కానీ.. పవన్ అభిమానులు కానీ ఎలా స్పందిస్తారో చూడాలి.

,  ,  ,  ,  ,