Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

04-Nov-2015 15:49:19
facebook Twitter Googleplus
Photo

అందుబాటులోకి వచ్చిన అత్యున్నత సాంకేతికత పుణ్యమా అని ప్రతి రంగంలోనూ రోబో సేవలు అందుబాటులోకి రావటం తెలిసిందే. ఆ మధ్యన షాప్ రిసెప్షనిస్ట్ గా.. సేల్స్ గళ్ మాదిరిగా కనిపించిన రోబోల మాదిరి.. ఒక సినిమాలో హీరోయిన్ గా రోబో నటించిన చిత్రం విడుదలకు సిద్ధమైంది.

అసలుసిసలు హీరోయిన్ ను తలపించేలా ఉన్న ఈ రోబో హీరోయిన్ ను.. రోబో కాదని వెనెవెంటనే చెప్పలేని విధంగా దీన్ని రూపొందించటం విశేషం. రబ్బరు తొడుగులతో అసలుసిసలు జపాన్ యువతిలా కనిపించే ఈ రోబో హీరోయిన్ అలరించటం ఖాయమని చెబుతున్నారు. రిమోట్ తో కంట్రోల్ చేసే ఈ రోబో నటించిన జపాన్ చిత్రం ఈ నెల 21న జపాన్ లో విడుదల కానుంది.

ఒక మానవ హీరోయిన్ ఏ విధంగా అయితే చేస్తుందో.. అలాంటి అన్నీ పనులు ఈ సినిమాలో రోబో హీరోయిన్ చేసిందని చెబుతున్నారు. జపాన్ యువతిలా కనిపించటమే కాదు.. మాట్లాడటం.. కదలికలు.. చివరకు భావోద్వేగాలు సైతం అసలుసిసలుగా హీరోయిన్ మాదిరే ఉన్నాయని చెబుతున్నారు. కేవలం 72లక్షల రూపాయిల ఖర్చుతో (72వేల యూరోలు. యూరో ఒక్కింటి రూ.వంద చొప్పున లెక్కిస్తే) దీన్ని రూపొందించినట్లు చెబుతున్నారు.

ఇక.. ఈ సినిమా విషయానికి వస్తే.. అణుదాడి తర్వాత జపాన్ ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులు చూపిస్తారట. సినిమా టైటిల్స్ లో రోబో పేరును ??జెమినాయిడ్ ఎఫ్?? అని వేసినట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి. మరి.. రోబో హీరోయిన్ జపనీయుల మనసుల్ని ఎంత మేర దోచుకుంటుందో విడుదల అయితే కానీ చెప్పలేం. ఇప్పటివకే వర్చువల్ వరల్డ్ లో మునిగిపోతున్న మనిషి.. ఈ రోబో హీరోయిన్ల మీద మనసు పడి.. విపరీతమైన ప్రేమను పెంచేసుకుంటే..?

,  ,  ,  ,