Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

31-May-2017 12:39:28
facebook Twitter Googleplus
Photo

సినీ పరిశ్రమలో తమకంటూ ఒక గుర్తింపు వచ్చే వరకు చాలామంది అణిగి మణిగే ఉంటారు. చాలా విషయాల్లో రాజీ పడతారు. ఎదుటి వారి మాటకు అనుగుణంగా వెళ్లిపోతారు. కానీ దాసరి దర్శకుడు కాకముందే.. రచయితగా కూడా పెద్ద పేరు తెచ్చుకోకముందే చాలా మొండిగా ఉండేవారు. ఆయనకు ఆత్మాభిమానం ఎక్కువ. ఆ విషయంలో అస్సలు రాజీ పడేవారు కాదు. తన పనిలో ఎవరైనా జోక్యం చేసుకుంటే ఒప్పుకునేవారు కాదు. రచయితగా.. దర్శకుడిగా తాను నమ్మిందానిపై ఆయన అస్సలు రాజీ పడేవారు కాదు. ఈ విషయంలో పెద్ద పెద్ద వాళ్ల దగ్గర కూడా ఆయన తగ్గలేదు. ఇందుకు కొన్ని ఉదాహరణలు కూడా ఉన్నాయి.

దాసరి దర్శకుడు కాకముందు రచయితగా పని చేశారు. ఆయన రచయితగా తొలి అడుగులు వేస్తున్న సమయంలో ఓ సినిమాకు మాటలు రాశారు. ఐతే దాసరి రాసిన ఓ డైలాగ్ గురించి సీనియర్ నటి సూర్యకాంతం అభ్యంతరం వ్యక్తం చేశారట. మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు అనే నానుడికి బదులుగా.. కుంటి కుక్కపై కొబ్బరికాయ పడ్డట్టు అని రాశారట దాసరి. దాన్ని మార్చమని సూర్యకాంతం అడిగారట. దాసరి ఒప్పుకోకపోవడంతో షూటింగ్ కూడా ఆగిపోయిందట. యూనిట్లో వాళ్లందరూ కూడా సూర్యకాంతం అంతగా పట్టుబడుతున్నారు కాబట్టి డైలాగ్ మార్చమని అడిగారట. ఐతే దాసరి అలా అయితే రచయితగా వేరే వాళ్లను పెట్టుకోండి అన్నారట. చివరికి సూర్యకాంతమే రాజీ పడి దాసరి రాసినట్లే డైలాగ్ చెప్పారట.

ఇక దాసరి దర్శకుడిగా మారాక మహానటుడు ఎస్వీ రంగారావుతోనే పేచీ ఎదురైందట. ఓ సినిమా క్లైమాక్స్ కోసం దాసరి రాసిన డైలాగ్ చాలా పెద్దగా అనిపించి.. దాన్ని కొంచెం కుదించమన్నారట దాసరి. ఐతే డైలాగ్ అలా ఉంటేనే క్లైమాక్స్ హైలైట్ అవుతుందని ఎస్వీఆర్ కు చెప్పాడట దాసరి. దీంతో ఆయనకు కోపం వచ్చి తన చేతి కర్రను.. తలపాగాను విసిరికొట్టి కోపంగా సెట్ లోంచి బయటకి వచ్చి కారెక్కి వెళ్లిపోయారు. అయినా దాసరి చలించలేదు. కాసేపటికి ఎస్వీఆర్ తిరిగొచ్చి మొత్తం డైలాగ్ అలాగే చెప్పారట. అప్పుడు దాసరి.. మీరు క్లైమాక్స్ రషెస్ చూశాక ఆ డైలాగ్ తీసేయవచ్చంటే తీసేస్తాను అన్నాడట. అప్పుడు ఎస్వీఆర్ ఆయన భుజం తట్టి దర్శకుడంటే ఇలాగే కఠినంగా ఉండాలని అన్నారట. దటీజ్ దాసరి.

సినీ పరిశ్రమలోకి వస్తే మందు కొట్టే అలవాటు తప్పనిసరి అంటారు. ఐతే దాసరి మద్యం ముట్టనే ముట్టరు. ఈ విషయంలో ఎవరెంత బలవంత పెట్టినా ఆయన చలించలేదు. ఇంకా దాసరి దర్శకుడు కాకముందు ఓ ప్రొడక్షన్ హౌజ్ లో పార్టీ జరుగుతుండగా.. ఆయన పాటికి ఆయన మాటలు రాసుకుంటూ కూర్చున్నారట. అప్పుడు మరో రచయిత మందు గ్లాసు తెచ్చి దాసరికి ఇస్తే.. తాను మద్యం తాగనని చెప్పాడట. ఇలా అయితే నువ్వు జన్మలో డైరెక్టర్ కాలేవు అన్నారట . దానికి బదులుగా.. ఇప్పుడే కాదు ఎప్పటికీ నేను తాగను. అదే జరిగితే రచయితగా పెన్ను ముట్టుకోను.

,  ,  ,  ,  ,