Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

17-Oct-2017 12:58:38
facebook Twitter Googleplus
Photo

యువ హీరోలు రొటీన్ కి బిన్నంగా సినిమాలను తీసి మంచి హిట్స్ అందుకుంటున్నారు. కథ ఎంత కొత్తగా ఉంటే అంత బెస్ట్ అనేలా చూసుకుంటున్నారు. ఆ తరహాలో హిట్స్ అందుకున్న హీరోల్లో రాజ్ తరుణ్ ఒకరు. వచ్చిన కొత్తలో మనోడు డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో వరుస హ్యాట్రిక్ హిట్స్ అందుకున్నాడు. అయితే ఆ తర్వాత మళ్లీ ఎందుకోగానీ కాస్త డౌన్ అయ్యాడు.

ప్రస్తుతం రాజు గాడు యమా డేంజర్ సినిమాతో బిజీగా ఉన్న ఈ కుర్ర హీరో మారో సినిమాను మొదలు పెట్టడానికి డిసైడ్ అయ్యాడు. దిల్ రాజు ప్రొడక్షన్ లో అనీష్ కృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కబోతోంది. ఆ సినిమాలో రాజ్ తరుణ్ సరికొత్తగా కనిపించబోతున్నాడట. అసలైతే ఈ చిత్రం ఎపుడో మొదలవ్వాలి. కానీ దిల్ రాజు కొన్ని కారణాల వల్ల వాయిదా వేస్తూ వచ్చారు. ఫైనల్ గా మరో ఏడు రోజుల్లో సినిమా పట్టాలెక్కనుందని తెలుస్తోంది. ఎలాగైనా సినిమాలను మొదలు పెట్టాలని దిల్ రాజు ఆలోచిస్తున్నారట.

అలా ఎలా? అనే మూవీతో మంచి హిట్ అందుకున్న అనీష్ సెకండ్ మూవీనే దిల్ రాజు ప్రొడక్షన్ లో చేయడం చాలా లక్కీగా ఫీల అవుతున్నాడు. సినిమా మినీ బడ్జెట్ లోనే ఉంటుందని సమాచారం. ప్రస్తుతం రాజ్ తరుణ్ రాజు గడు యమ డేంజర్ సినిమాతో బిజీగా ఉన్నాడు.

,  ,  ,  ,