మెగా అభిమానులంతా ఎప్పుడెప్పుడు మెగా స్టార్ చిరంజీవి 150వ సినిమా మొదలవుతుందా అని చాలాకాలంగా చూసిన ఎదురుచూపులకు తెరదించుతూ, కొద్దిరోజుల క్రితమే ఆయన తన సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్ళిన విషయం తెలిసిందే. వీవీ వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా ప్రస్తుతం హైద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇక సినిమా సెట్స్పైకెళ్ళినా ఇందులో హీరోయిన్గా నటించేది ఎవరన్నది మాత్రం ఇంకా ఖరారు కాలేదు. ఈ విషయమై చాలాపేర్లే వినిపిస్తున్నా ఇంకా ఎవ్వరూ ఫైనల్ కాలేదు.
తెలుగులో ప్రస్తుతం స్టార్ హీరోయిన్లలో ఒకరైన కాజల్‌ను కూడా చిరుకు హీరోయిన్గా సంప్రదించారట. అయితే ఆమె ఈ సినిమాలో నటించేందుకు ఏకంగా 2.5కోట్లకు పైనే పారితోషికం డిమాండ్ చేశారట. కాజల్ తన కెరీర్లో ఇంత మొత్తం ఎప్పుడూ డిమాండ్ చేయలేదని తెలుస్తోంది. ఇక ఈ స్థాయిలో పారితోషికం ఇవ్వడం ఇష్టం లేని నిర్మాతలు కాజల్‌ను కాకుండా వేరొక హీరోయిన్ను సంప్రదిస్తున్నారని సమాచారం. తమిళంలో ఘన విజయం సాధించిన ?కత్తి?కి రీమేక్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాను చిరు తనయుడు రామ్ చరణ్ స్వయంగా నిర్మిస్తున్నారు.