Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

16-Dec-2014 11:06:10
facebook Twitter Googleplus
Photo

మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాదులోని రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. కొరటాల శివ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతున్న సంగతి మనకు తెలిసిందే. ఫిలిం సిటీలోని మండువా లోగిలి సెట్లో మహేష్ బాబు, శ్రుతి హాసన్, రాజేంద్రప్రసాద్, అలీ తదితరులు పాల్గొంటున్న సన్నివేశాలను ప్రస్తుతం చిత్రీకరిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రాన్ని మై'త్రీ' మూవీస్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమాకి 'శ్రీమంతుడు' అనే టైటిల్ పరిశీలిస్తున్నట్టు తాజాగా ప్రచారం జరుగుతోంది. 'మిర్చి' వంటి సూపర్ హిట్ సినిమా తర్వాత కొరటాల శివ గ్యాప్ తీసుకుని చేస్తున్న చిత్రమిది.

,  ,  ,  ,  ,