Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

06-Sep-2017 10:49:53
facebook Twitter Googleplus
Photo

చాలామంది యువ దర్శకులు.. వాళ్ల కథల్ని వాళ్లే రాసుకుంటున్నారు. స్క్రీన్ ప్లే సమకూర్చుకుంటున్నారు. మాటలు కూడా వాళ్లే రాసుకుంటున్నారు. కానీ ఒకప్పుడిలా ఉండేది కాదు. రైటర్లు కథలు.. స్క్రీన్ ప్లేలు రాస్తే.. దర్శకులు స్క్రిప్టు పట్టుకుని సినిమాలు తీసేవాళ్లు. రాఘవేంద్రరావు.. కోదండరామిరెడ్డి లాంటి పెద్ద దర్శకులు ఈ పద్ధతే ఫాలో అయ్యేవాళ్లు. ఈ తరంలో రాజమౌళి.. వి.వి.వినాయక్ లాంటి స్టార్ డైరెక్టర్లు కూడా ఇదే తరహాలో సినిమాలు తీస్తున్నారు. ఐతే ‘అర్జున్ రెడ్డి’తో సూపర్ పాపులారిటీ సంపాదించిన యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ ఈ పద్ధతిని తప్పుబడుతున్నాడు. ఒకరు స్క్రిప్టు రాసి.. ఇంకొకరు సినిమా తీయడంపై తనకు సదభిప్రాయం లేదని చెప్పాడు.

ఒకరు స్క్రిప్టు రాస్తే దాన్ని ఎవరైనా రచయిత ఫైన్ ట్యూనింగ్ చేస్తే ఓకే కానీ.. అలా కాకుండా రచయితలు పూర్తి స్క్రిప్టును రాయడం.. అందులోనూ సినిమాలోని కీలకమైన సన్నివేశాల్ని రచయితలే రాయడం.. దాన్ని దర్శకుడు తెరకెక్కించడం నాకు ఆశ్చర్యం కలిగిస్తుంది. నాకు స్వతహాగా రచయితలు కూడా అయిన దర్శకులంటే ఇష్టం. ఒక ప్యాకేజీ లాగా సినిమాను తీర్చిదిద్దడం కంటే.. ఎంటర్టైన్ చేయడం కంటే ఒక కథను చెబితే బాగుంటుందన్నది నా ఉద్దేశం. కథను చెబుతూ అందులోంచి వినోదం పుట్టించాలి. నటుల కంటే పాత్రల్ని జనాలు ఎక్కువ ఇష్టపడాలి. కొందరు ఆసక్తికరమైన సన్నివేశాలు రాస్తారు. తీస్తారు. కానీ అందులో ఎమోషనల్ కనెక్ట్ ఉండదు.

,  ,  ,  ,  ,