నాగ నాగచైతన్య హీరోగా సోగ్గాడే చిన్న నాయన ఫేమ్ కళ్యాణ్ కృష్ణ తెరకెక్కిస్తున్న నూతన చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ గా రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ను ఎంపిక చేసారు. గతం లో చైతు తో దేవి 100% లవ్ , దడ చిత్రాలకు మ్యూజిక్ అందించగా అందులో 100% సూపర్ హిట్ అయ్యింది.
మళ్లీ కొంత గ్యాప్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా రావడం తో ఫ్యాన్స్ హ్యాపీ గా ఫీల్ అవుతున్నారు. చైతు కు జంటగా రకుల్ ప్రీతి సింగ్ నటిస్తుంది. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నాగార్జున నిర్మించబోతున్న చిత్రానికి నిన్నే పెళ్లాడతా అనే టైటిల్ ఫిక్స్ చేయబోతున్నారట.
గతం లో ఈ చిత్రానికి రకరకాల టైటిల్స్ అనుకున్నప్పటికీ కథ ఓ ఫ్యామిలీ సబ్జెక్ట్ కావడం, అందులోనూ పెళ్లి నేపథ్యంలో ఉండడం తో ఈ టైటిల్ అయితే కరెక్ట్ గా సెట్ అవుతుందని ఒకే చేశారట.