Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

01-Dec-2015 15:50:23
facebook Twitter Googleplus
Photo

తమిళంలో దేవిశ్రీ ప్రసాద్ కు మంచి క్రేజ్ తీసుకొచ్చిన సినిమాల్లో ?సింగం? ఒకటి. అందులోని ప్రతి పాటా హిట్టే. బ్యాగ్రౌండ్ స్కోర్ సైతం ఓ ఊపు ఊపేసింది. ఆ సినిమా తర్వాత కోలీవుడ్ లో మాస్ సినిమాలకు దేవిశ్రీ మంచి ఛాయిస్ అయిపోయాడు. సింగం సిరీస్ లో వచ్చిన సింగం-2 కూడా దేవిశ్రీకి మంచి పేరే తెచ్చిపెట్టింది. ఇప్పుడు సింగం-3కి కూడా రంగం సిద్ధమవుతోంది. కానీ ఈ సినిమాకు దేవిశ్రీ పని చేయట్లేదు. దేవిని తప్పించి అనిరుధ్ రవిచందర్ ను తీసుకుంటున్నట్లు అప్పట్లో వార్తలొచ్చాయి. కానీ అది రూమరే అని తేలిపోయింది.

కానీ తాజా వార్త ఏంటంటే.. దేవి సింగం-3కి పని చేయట్లేదు. అతడి స్థానంలో హారిస్ జైరాజ్ ను తీసుకున్నాడట హరి. నిజానికి హారిస్ మ్యూజిక్ కొంచెం క్లాస్ గా ఉంటుంది. సింగం తరహా సినిమాలకు సూటవ్వదు. అయినప్పటికీ హరి.. అతణ్నే ఎంచుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. మరీ ఇంత పట్టుబట్టి దేవిశ్రీని తప్పించారెందుకో మరి. ఈ మధ్య తెలుగు సినిమాలతో బాగా బిజీ అయిపోవడం వల్ల కావచ్చేమో. తెలుగులో నాన్నకు ప్రేమతో - సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలతో పాటు ఎన్టీఆర్-కొరటాల కాంబినేషన్ లో రాబోయే మూవీకి కూడా దేవీనే మ్యూజిక్ డైరెక్టర్ అన్న సంగతి తెలిసిందే.

,  ,  ,