Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

05-Aug-2016 13:31:33
facebook Twitter Googleplus
Photo

పవన్ కళ్యాణ్ కొత్త సినిమాకి సర్వం సిద్ధమైయింది. డాలీ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా ఈ రోజే సెట్స్ పైకి వెళ్లనుంది. ఈలోగా ఈ సినిమా పై ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ ఫిల్మ్ నగర్ లో చెక్కర్లు కొడుతుంది. అదేంటంటే .. కధ ప్రకారం ఈ సినిమాలో ఓ ఇద్దరు కుర్ర హీరోల అవసరం వుందట . ప్రస్తుతం వీరికోసమే అన్వేషణ చేస్తున్నారని వినిపిస్తుంది.

పవన్ కళ్యాణ్ ఎక్కువగా సోలోగానే కనిపిస్తారు. ఇతర హీరోలు ఆయనతో స్క్రీన్ పంచుకోవడం చాలా అరుదు. అయితే ఈ మధ్యే వెంకీ గోపాల గోపాలలో కృష్ణుడిగా కనిపించి అలరించారు. ఇప్పుడు ఆయన కొత్త సినిమాలో మరో ఇద్దరు కుర్ర హీరోలని వార్త బయటికి రావడం ఆసక్తికరమైన విషయమే. అయితే ఇందులో వాస్తవం ఏంతో తెలియాల్సి వుంది

,  ,  ,  ,  ,  ,  ,