Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

06-Jul-2015 17:18:17
facebook Twitter Googleplus
Photo

ఎప్పటికప్పుడు కొత్తదనంతో ప్రేక్షకులను మెప్పించడానికి ధనుష్ ఎంతగానో ప్రయత్నిస్తుంటాడు. అందులో భాగంగానే ఆయన ప్రభుసాల్మన్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. కీర్తిసురేష్ కథానాయికగా అలరించనున్న ఈ సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రస్తుతం అందుకు అవసరమైన సన్నాహాలు జరుగుతున్నాయి. ఒక రైల్లో జరిగే సంఘటనని ఆధారంగా చేసుకుని ఈ సినిమా అంతా నడుస్తుంది.

అందువలన ఈ సినిమా కోసం భారీ రైల్వేస్టేషన్ సెట్ ను ఏర్పాటు చేస్తున్నారు. రైల్లోను .. రైల్వే స్టేషన్లోను ఉత్కంఠను రేకెత్తించే యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. హాలీవుడ్ యాక్షన్ చిత్రాలకు స్టంట్ మాస్టర్ గా పనిచేస్తోన్న రోగర్ యువాన్, ఈ సినిమాకి యాక్షన్ ఎపిసోడ్ ను ప్లాన్ చేస్తున్నాడు. అందువలన ఈ సినిమాకి ఈ యాక్షన్ ఎపిసోడ్ హైలైట్ గా నిలవడం ఖాయమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

,  ,  ,