Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

30-May-2016 14:02:55
facebook Twitter Googleplus
Photo

చిత్రపరిశ్రమలో ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన సంగీత దర్శకుడు ?ఇళయరాజా?. ఇళయరాజా అసలు పేరు జ్ఞానదేశికన్. 1943, జూన్ 2 లో తమిళ్ నాడు లోని తేని జిల్లాలో పన్నియపురంలో జన్మించాడు. గ్రామీణ ప్రాంతంలో పెరగటం వల్ల పొలాల్లో రైతులు పాడుకునే పాటలతో జానపద సంగీత పరిచయం కలిగింది. స్కూల్ లో చేర్పించేటప్పుడు జ్ఞానదేశికన్ పేరుని ఆయన తండ్రి రాజయ్య గా మార్పించారు. సంగీతం నేర్చుకోవడానికి ధనరాజ్ మాస్టర్ దగ్గర చేరినప్పుడు ఆయన ఆ పేరును రాజా గా మార్చారు. 1976 లో సంగీత దర్శకుడిగా తమిళ్ లో మొదటిసినిమా ?అన్నకిలి? చేస్తున్నప్పుడు ఆ చిత్ర నిర్మాత పంచు అరుణాచలం ఆయనని ?ఇళయ? (అంటే చిన్నవాడు అని తమిళ్ లో అర్థం) అని పిలిచేవాడు. ఆరోజుల్లో ఏ.యం. రాజా అని మరో సంగీత దర్శకుడు ఉండటంతో ఈ రెండుపదాలని కలిపి ఇళయారాజా అని స్క్రీన్ నేమ్ పెట్టారు.
ఎందుకంటే అన్న సినిమాతో సంగీత దర్శకుడిగా పరిచయమైన పాటలు రచించడంతో పాటు పాడాడు కూడా. తన 40 సంవత్సరాల వృత్తి జీవితములో వివిధ భాషలలో దాదాపు 5,000 పాటలకు, 1000 సినిమాలకు సంగీత దర్శకత్వం వహించాడు. 1993 న లండన్ లోని ప్రఖ్యాత రాయల్ ఫిల్హర్మోనిక్ ఆర్కెస్ట్రా తో ఒక పూర్తి స్తాయి ?సింఫనీ? ని కంపోజ్ చేసారు. ఆసియా ఖండం లో ఈ ఘనత సాధించిన తొలి వ్యక్తిగా రికార్డు సృష్టించారు. ఆయన చిత్రపరిశ్రమలో చేసిన సేవలకు గాను 2010 లో భారత ప్రభుత్వం ?పద్మభూషణ్? పురస్కారం తో సత్కరిచింది. ఆయన ఇటీవల సంగీతం సమకూర్చిన ?తరై తాపట్టై? సినిమానేపథ్య సంగీతానికి ఉత్తమ సంగీత నేపథ్యం విభాగంలో జాతీయ అవార్డు పొందింది. ఇళయరాజా ఇద్దరు కుమారులు కార్తీక్ రాజా, యవన్ శంకర్ రాజా, కుమార్తె భవతారణి అయన వారసత్వాన్ని కొనసాగిస్తూ సంగీత దర్శకులుగా మారారు.

,  ,  ,  ,  ,  ,