Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

05-Jun-2017 12:45:22
facebook Twitter Googleplus
Photo

కోలీవుడ్ హీరో ధనుష్ పేరు కొన్ని వారాల క్రితం వివాదంలోనే ప్రముఖంగా వినిపించింది. సహజంగా ఇలాంటివాటికి దూరంగా ఉండే ఈ హీరో.. సుచి లీక్స్ కారణంగా వివాదంలో ఇరుక్కున్నాడు. ఆ హంగామా అంతా ఓ కొలిక్కి వచ్చిన తర్వాత.. ఇప్పుడు మళ్లీ తన ట్యాలెంట్ చూపిస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు రజినీకాంత్ అల్లుడు ధనుష్.

రీసెంట్ గా రిలీజ్ అయిన పా పాండీ చిత్రంతో దర్శకుడిగా ధనుష్ తన ప్రతిభను చూపించాడు. తొలి చిత్రమే అయినా.. అత్యంత అనుభవం ఉన్న డైరెక్టర్లకు సాటిగా సినిమా రూపొందించి విమర్శకుల మెప్పు కూడా పొందాడు. కోలీవుడ్.. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ మెప్పు కూడా సంపాదించిన ఈ హీరో.. ప్రస్తుతం ఇంటర్నేషనల్ ఆడియన్స్ పై కూడా దృష్టిపెట్టాడు. ది ఎక్స్ ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ఫకీర్ అనే మూవీతో హాలీవుడ్ లో కూడా అడుగు పెట్టేస్తున్న ధనుష్.. ప్రస్తుతం యూరోప్ లో షూటింగ్ చేస్తున్నాడు. ఇదే సమయంలో ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ ఇంగ్లాండ్ లోనే కావడంతో.. సరిగ్గా ఆ టైంకి స్టేడియం దగ్గర వాలిపోయాడు ధనుష్.

పోడియంలో నుంచుని హంగామా చేయడం లాంటివి కాకుండా.. సచిన్ టెండూల్కర్ ను కలుసుకునేందుకు వెళ్లాడు ధనుష్. ఇండియా వర్సెస్ పాకిస్తాన్.. స్టేడియంలో.. క్రికెట్ దేవుడు సచిన్ ను కలిసే అవకాశం చిక్కింది

,  ,  ,  ,  ,