Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

07-Jul-2016 12:38:09
facebook Twitter Googleplus
Photo

దర్శకుడు విఘ్నేశ్‌శివ పాటకు నటుడు ధనుష్ గాత్రం ఇచ్చారు. ఈయన సాధారణంగా తన చిత్రాలకు తప్ప ఇతర చిత్రాలకు పాడరు. ఇక యువ దర్శకుడు విఘ్నేశ్‌శివ ఒక పక్క దర్శకుడిగా మరో పక్క గీతరచయితగా తన సత్తా చాటుకుంటున్నారు. తాజాగా యాక్కై అనే చిత్రానికి ఆయన రాసిన పాటకు యువన్ శంకర్‌రాజా సంగీత భాణీలు కట్టారు. ఇక ఈ పాటను నటుడు ధనుష్ పాడడం విశేషం. యువ నటుడు కృష్ణ,స్వాతి జంటగా నటించిన చిత్రం యాక్కై. ప్రైమ్ పిక్చర్స్ పతాకంపై ముత్తుకుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కుళందై వేలప్పన్ దర్శకత్వం వహిస్తున్నారు.


ఈ చిత్రం కోసం దర్శకుడు విఘ్నేశ్‌శివ రాసిన ఉనక్కు వెయిట్ పన్ని. ఎన్ బాడీ వీక్ ఆగుదు, బేస్‌మెంట్ షేక్ ఆగుదు.. హర్ట్ బ్రేక్ ఆగుదు అనే పాటను ఇటీవలే యువశంకర్‌రాజా సంగీతాన్ని అందించగా ఈ పాటను నటుడు ధనుష్ పాడారని చిత్ర వర్గాలు వెల్లడించారు. ఈ పాట యువ మధ్య విశేష ఆదరణ పొందుతుందనే నమ్మకాన్ని చిత్ర యూనిట్ వ్యక్తం చేశారు.కాగా ఈ సింగిల్ ట్రాక్‌ను ఎనిమిదో తేదీన విడుదల చేయనున్నట్లు తెలిపారు.

,  ,  ,  ,  ,  ,