Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

15-Jun-2016 17:19:30
facebook Twitter Googleplus
Photo

సోషల్ మీడియాలో తెలుగు వాళ్లు అత్యంత ఆసక్తిగా గమనించే ప్రొఫైల్స్ లో రాజమౌళిది ఒకటి. ట్విట్టర్లో రాజమౌళి ప్రొఫైల్ పిక్స్ ఆసక్తి రేకెత్తిస్తుంటాయి. గత ఏడాది ఇస్రో ఓ ప్రయోగంలో అద్భుత విజయం సాధించిన సందర్భంగా దానికి సంబంధించిన పిక్ పెట్టి తన దేశభక్తిని చాటుకున్న రాజమౌళి.. చాలా కాలం దాన్నే ప్రొఫైల్ పిక్ గా కొనసాగించాడు. ఐతే ఇటీవలే ?బాహుబలి: ది కంక్లూజన్? క్లైమాక్స్ చిత్రీకరణ ఆరంభించగానే ప్రొఫైల్ పిక్ మార్చాడు జక్కన్న. అది జనాల్లో భలే ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇది బాహుబలి సినిమాతో కనెక్షన్ ఉన్న ఫొటో. అది ఓ రాజ్యానికి సంబంధించిన చిహ్నంలాగా ఉంది. ఇది రాజమౌళి ఊహల్లో రూపుదిద్దుకున్న మహిష్మతి రాజ్యానికి సంబంధించిన రాజముద్ర అయిఉండవచ్చని అనిపిస్తోంది.

చతురస్రాకారంలో ఉన్న ఈ ముద్రలో రెండు గుర్రాలు చెరో వైపు చూస్తుండగా..వాటి మధ్య నుంచి సింహాసనం మీదకు దారి ఉంది. సింహాసనం చుట్టూ వర్తులాకారంలో ఉన్న సూర్యుడు కనిపిస్తున్నాడు. మహిష్మతి రాజులు సూర్య వంశీయులు అనడానికి ఇది సూచిక కావచ్చు. లేదా మహిష్మతి రాజ్య కీర్తి నలువైపులా వ్యాప్తి చెందటానికి ఈ చిహ్నం గుర్తు కావచ్చు. మొత్తానికి ఈ చిహ్నం భలే ఆసక్తిని రేకెత్తిస్తోంది. ?బాహుబలి: ది కంక్లూజన్? పూర్తయి విడుదలయ్య వరకు జక్కన్న ఈ చిహ్నాన్నే ప్రొఫైల్ పిక్ గా కొనసాగించే అవకాశాలున్నాయి. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో బాహుబలి-2 క్లైమాక్స్ చిత్రీకరణ జరుగుతోంది. రెండున్నర నెలల పాటు నిర్విరామంగా ఈ సన్నివేశాలు చిత్రీకరిస్తారు. 2017 ఏప్రిల్ 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తుంది.

,  ,  ,  ,  ,