Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

09-Nov-2016 14:00:19
facebook Twitter Googleplus
Photo

కేవలం సినిమా హీరో మాత్రమే కాదు.. చాలాకాలం నుండి ధనుష్ 'వండర్ బార్ ఫిలింస్' ద్వారా ఒక మంచి ప్రొడ్యూసర్ గా కూడా పేరొందుతున్నాడు ధనుష్. ఇప్పుడు మనోడు ఏకంగా రచయితగా కూడా మారాడు. తనే కథ మాటలు రాస్తున్నాడు. ఇంతకీ ఏ సినిమా అనేగా మీ సందేహం. పదండి చూద్దాం.

వేల ఇల్లయ్ పట్టదారి ఎలియాస్ ''విఐపి'' ఎంత పెద్ద హిట్ అనేది మనకు తెలసిందే. వేల్ రాజ్ డైరక్షన్లో రూపొందిన ఈ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ రూపొందిస్తున్నాడు ధనుష్. రఘువరన్ పాత్రలో మరోసారి రచ్చ చేయడానికి ఈసారి తనే స్వయంగా కథ మాటలు రాసుకుంటున్నాడు. మరి డైరక్షన్ ఎవరో తెలుసా? మొన్నామధ్య డాడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ తో యానిమేషన్ సినిమా తీసిన చిన్న కూతురు సౌందర్య.. ఇప్పుడు తన అక్కయ్య మొగుడు ధనుష్ ను డైరక్ట్ చేస్తోంది. మొత్తానికి ఫ్యామిలీ ఫ్యామిలీ ఇలా సినిమా చేస్తే భలేఉందబ్బా.

ఒక ప్రక్కన ధనుష్.. ఇంకో ప్రక్కన మరదలు సౌందర్య.. మరో ప్రక్కన సౌందర్య మావయ్య కొడుకు అనిరుధ్ మ్యూజిక్.. రజనీకి ఎంతో క్లోజ్ అయిన కలైపులి ధాను ప్రొడక్షన్.. విఐపి 2 అంటూ తెలుగులో కూడా ఒకేసారి రిలీజ్. దట్స్ ధనుష్ ప్లానింగ్ అనాల్సిందే.

,  ,  ,  ,  ,  ,