Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

15-Jul-2017 12:17:06
facebook Twitter Googleplus
Photo

మత్తుమందుల కేసులో ప్రముఖంగా వినిపిస్తున్న పేర్లలో మాస్ మహరాజ్ అంటూ అభిమానులు పిలుచుకునే రవితేజ పేరు ఉండడం.. ఫ్యాన్స్ ను తెగ బాధ పెట్టేస్తోంది. అయితే.. డ్రగ్స్ సరఫరా/వాడకం కేసు విషయంలో.. రవితేజపై అంతగా సాక్ష్యాలు లేవనే మాట వినిపిస్తోంది.

పట్టుబడ్డ కెల్విన్.. జీషన్ ల ఫోన్ లో వాట్సాప్ డేటా ఆధారంగా ఈ కేసును కదిలించగా.. ఇందులో చాలామందికి సంబంధించిన వివరాలే పోలీసులకు లభించాయి. ఇప్పటికే 12 మంది వ్యక్తులకు నోటీసులు అందించామని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ కు చెందిన ఎన్ఫోర్స్ మెంట్ వింగ్ డైరెక్టర్ అకున్ సభర్వాల్ చెప్పారు. అయితే.. ఈ కేసులో దర్శకుడు పూరీ జగన్నాధ్.. హీరో నవదీప్ లకు చెందిన వాట్సాప్ సంభాషణలను కీలకంగా తీసుకోగా.. రవితేజ విషయంలో మాత్రం స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఏదీ లభించలేదని తెలుస్తోంది. అలాగే నోటీసులు ఇష్యూ చేసినా.. పలువురు మాత్రం వీటిని అందుకునేందుకు తిరస్కరించారట.

ముమైత్ ఖాన్ కు పంజాగుట్టలోని ఆమె ఉండే ఇంటిలో నోటీసు అందించేందుకు ప్రయత్నించగా.. ఆమె నిరాకరించడంతో ముంబై అడ్రసుకు పంపారట. శ్యామ్ కె నాయుడు తండ్రి కూడా నోటీసులు అందుకునే అంగీకరించలేదు. అయితే.. సినిమా రంగానికి చెందిన 12 మందికి ఎన్డీపీఎస్ యాక్ట్ సెక్షన్ 67 ప్రకారం నోటీలసు అందించి

,  ,  ,  ,