Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

24-Sep-2016 11:08:08
facebook Twitter Googleplus
Photo

తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ అంటే తనకు ఎంత ఇష్టమో చెప్పే ప్రయత్నం చేశాడు మహేంద్ర సింగ్ ధోనీ. ప్రస్తుతం ఎంఎస్ ధొనీ సినిమా ప్రమోషన్ లో భాగంగా చెన్నైలో ఉన్న ధోనీ అక్కడి స్టార్స్ అందరినీ కలుస్తున్నాడు. ఈ సందర్భంగా హీరో సూర్య భార్య జ్యోతిక వారి పిల్లలను థియేటర్ లో కలుసుకున్న ధోనీ.. రజనీ సార్ తర్వాత మీ నాన్నే నా ఫేవరెట్ హీరో అని ఆ పిల్లలతో అన్నాడు. ఈ సందర్భంగా రజనీ డైలాగులు వచ్చా అని అడిగిన పిల్లలకు షాక్ ఇచ్చాడు ధోనీ. రజనీ కాంత్ డైలాగులు కూర్చుని చెబితే బాగోదు - నిల్చొని చెబితే గౌరవంగా ఉంటుందని చెప్పి కుర్చీలోంచి లేచి మరీ "నరసింహ" సినిమాలో డైలాగ్.. "ఎన వళి తనీ వళి" - నా దారి రహదారి అని రజనీ స్టైల్లో చెప్పాడు ధోని.

అనంతరం తలైవర్ ని కలవడానికి వెళ్లిన ధోనీ - ఆ సమయంలో రజనీపై తనకున్న గౌరవాన్ని - అభిమానాన్ని చెప్పాడు. తనకు చెన్నై రెండో ఇల్లుగా మారిందని - చెన్నైకి ఎప్పుడు వచ్చినా రజనీ కాంత్ ని కలవాలని మనస్సులో ఉండేదని కాకపోతే ఎవరినైనా అడుగుదామని అనుకుంటే సిగ్గుగా ఉండేదని.. అందుకే ఇన్నాళ్లూ కలవలేకపోయానని.. అయినా పర్లేదు ఈ రోజు కలుస్తున్నందుకు సంతోషంగా ఉందని గుక్కతిప్పుకోకుండా చెప్పుకొచ్చాడు ధోని. అనంతరం నటుడు ధనుష్ ఇంట్లో రజనీకాంత్ ని కలుసుకున్నాడు ధోని.

ఈ సందర్భంగా ధోనీతోపాటు ?ఎంఎస్ ధోనీ? హీరో సుశాంతసింగ్ - నిర్మాత - ధోనీ స్నేహితుడు అరుణ్ పాండే కూడా రజనీని కలుసుకున్నవారిలో ఉన్నారు. ధోనీని ఎంతో సాదరంగా ఆహ్వానించి - ఆత్మీయంగా పలకరించిన రజనీకాంత్.. అనంతరం శాలువాతో సత్కరించారు.

,  ,  ,  ,  ,