Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

17-Sep-2016 11:48:31
facebook Twitter Googleplus
Photo

ఇప్పటికే బాలీవుడ్లో బోలెడు బయోపిక్స్ వచ్చాయి. ఐతే వాటన్నింటినీ ఎం.ఎస్.ధోని.. ది అన్ టోల్డ్? స్టోరీ కొట్టేస్తుందనడంలో ఎవరికీ సందేహాలు లేవు. ధోని సినిమా చూడ్డానికి ప్రేక్షకులు ఎంతగా తపించి పోతున్నారో ఆ సినిమా ట్రైలర్ కు వచ్చిన రెస్పాన్సే నిదర్శనం. ఏకంగా ఇప్పటికే 2 కోట్ల మంది ఈ ట్రైలర్ వీక్షించారు. ఈ సినిమాకు బిజినెస్ కూడా ఓ రేంజిలో జరిగింది. బాలీవుడ్ సూపర్ స్టార్ల సినిమాలకు ఏమాత్రం తీసిపోని రీతిలో బిజినెస్ చేసిందీ సినిమా. ప్రేక్షకుల్లో ఆసక్తి కూడా స్టార్ హీరోల సినిమాలపై ఉన్నట్లే ఉంది. ఈ నెల 30న భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ?ఎం.ఎస్.ధోని?.

ఈ నేపథ్యంలో ధోనికి తన సినిమాను చూపించారట. ప్రివ్యూ షో చూసి ధోని కదిలిపోయాడట. ఈ విషయాన్ని ధోని పాత్ర పోషించిన సుశాంత్ సింగ్ రాజ్ పుతే వెల్లడించాడు. ??ధోని నాతో కలిసి సినిమా చూశాడు. మధ్యలో బాగా నవ్వుతూ కనిపించాడు. చివరికి వచ్చేసరికి అతను కదిలిపోయాడు. ఓ 15 నిమిషాల పాటు ఎవరితోనూ మాట్లాడలేదు. చాలా ఉద్వేగంగా కనిపించాడు?? అని సుశాంత్ చెప్పాడు. ఇక తన సినిమా గురించి ధోని మాట్లాడుతూ.. ??ఈ సినిమాలో నన్ను గొప్పగా చూపించొద్దని.. ఉన్నదున్నట్లు వాస్తవికంగా చూపించాలని దర్శకుడు నీరజ్ పాండేకు ముందే చెప్పాను. ఓ ప్రొఫెషనల్ క్రీడాకారుడి జీవితాన్ని అలా చూపిస్తేనే బాగుంటుంది. ధోని సినిమా చూస్తుంటే నా జీవితంలోని అనుభవాలన్నింటినీ ఒకసారి స్పృశించినట్లు అనిపించింది. మంచి అనుభూతి కలిగింది?? అని ధోని అన్నాడు.

,  ,  ,  ,  ,  ,