Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

27-Aug-2015 16:03:07
facebook Twitter Googleplus
Photo

వరుసపెట్టి రెండు పరాజయాలతో టాప్ పొజిషన్ కి కాస్త దూరమైన మహేష్ బాబు శ్రీమంతుడు విజయంతో తిరిగి రేస్ లో చేరుకున్నాడు. మహేష్ బాబు.. ఒక్క హిందీ సినిమా చేయకున్నా దేశవ్యాప్తంగా నిర్వహించే పలు సర్వేల్లో బాలీవుడ్ స్టార్ లను సైతం పక్కనపెట్టి టాప్ లో నిలవడం పలు ప్రముఖ నేషనల్ లెవల్ బ్రాండ్స్ కు అంబాసిడర్ గా ఎంపికవ్వడం వంటివి మహేష్ క్రేజ్ కు నిదర్శనం.ఈ క్రేజ్ ని ఉపయోగించి మహేష్ ఈజీగా బాలీవుడ్ లో పాగా వేయచ్చు. పలుమార్లు మీడియా కూడా ఈ విషయంలో మహేష్ తో ముచ్చటించింది. అయితే మరోసారి మహేష్ తన తెలుగు కళామతల్లిపై వున్న మమకారాన్ని చాటుకున్నాడు.

ఇటీవలే ఓ ప్రముఖ తెలుగు న్యూస్ చానల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ లో మహేష్ బాలీవుడ్ ఎంట్రీపై తన అభిప్రాయాలు చెప్పుకొచ్చారు. ?బాలీవుడ్ లో సినిమా చేయాలన్న ఆలోచనైతే తనకు ఏమాత్రం లేదని ఇక్క ప్రూవ్ చేసుకోవలిసింది చాలానే వుందని తెలిపాడు. బాహుబలితో తెలుగు సినిమా స్టామినా అందరికీ తెలిసింది కాబట్టి ఆ పునాదులపై మనం కోటను నిర్మించాలని అది తన కల అని మనసులో మాటను బయటపెట్టాడు. ఇక ఈ మధ్యే విడుదలైన ?శ్రీమంతుడు? సక్సెస్ తో సూపర్ హ్యాపీగా ఉన్న మహేష్ సెప్టెంబర్ నెలలో తన తదుపరి సినిమా ?బ్రహ్మోత్సవం? షూటింగ్ లో పాల్గొనున్నాడు. .

,  ,  ,