Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

14-Nov-2016 12:41:37
facebook Twitter Googleplus
Photo

రామ్ చరణ్ మూవీ ధృవ ఇప్పుడు షూటింగ్ పూర్తి చేసేసుకుంది. హైద్రాబాద్ లో షూటింగ్ తో పాటు.. ధృవ టైటిల్ సాంగ్ షూట్ చేసుకున్న ధృవ టీం.. రీసెంట్ గా థాయ్ ల్యాండ్ వెళ్లి షూటింగ్ చేశారు. ఓ పాటతో పాటు.. ఓ ఫైట్ ను కూడా షూట్ పూర్తి చేసుకున్న ధృవ టీం.. దీంతో షూటింగ్ మొత్తం పూర్తయిపోయిందని తేల్చేసింది. కొన్ని వారాల ముందు నుంచే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా మొదలుపెట్టేయడంతో.. ఇప్పటికే చాలా వరకూ కంప్లీట్ అయిపోయింది కూడా. ఇంకా కేవలం 30శాతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ మాత్రమే పెండింగ్ అని చెబుతున్నారు యూనిట్.

ఈ లెక్కన ముందు నుంచి అనుకుంటున్న డిసెంబర్ 2 రిలీజ్ కి ఇబ్బందులు ఏం లేనట్లే కానీ.. నోట్ల రద్దు వ్యవహారం ఒకటి ఇబ్బంది పెట్టేలా ఉంది. ఇప్పటికే రిలీజ్ అయిన సినిమాలు కలెక్షన్స్ లేక కష్టాలు పడుతున్నాయి. అలాంటిది ధృవ లాంటి భారీ మూవీకి వసూళ్లు తగ్గితే ఇండస్ట్రీ మొత్తంపై ఎఫెక్ట్ ఉంటుంది. అయితే.. ధృవ మూవీ రిలీజ్ కి ఇంకా 20 రోజులు టైమ్ ఉండడం.. ఇప్పటికే మెల్లమెల్లగా నిబంధనలను సవరించడం ప్రారంభించడం చూస్తే.. ఆ డేట్ నాటికి పరిస్థితులు కాస్త కుదుటపడచ్చు అంటున్నారు.

మొదట ఆగస్ట్.. తర్వాత అక్టోబర్ లోనేరిలీజ్ చేయాలని అనుకున్న పరిస్థితుల నుంచి.. ఇప్పుడు డిసెంబర్ కు కూడా మార్చుకున్నాక.. మళ్లీ వాయిదా వేసేందుకు చరణ్ సిద్ధంగా లేడని టాక్.

,  ,  ,  ,  ,  ,