Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

29-Nov-2016 15:29:31
facebook Twitter Googleplus
Photo

రామ్ చరణ్ మూవీ ధృవ కోసం మెగా ఫ్యాన్స్ తెగ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మూవీకి సంబంధించి రిలీజ్ డేట్ తో సహా అన్నీ క్లారిటీ వచ్చేసినా.. ఒక్క విషయంలో మాత్రం ఇంకా అసంతృప్తితో ఉన్నారు ఫ్యాన్స్. ఆడియో ఫంక్షన్ చేయకపోవడంతో.. ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారని తెలిసినా.. దానికి సంబంధించిన డీటైల్స్ మాత్రం రాలేదు. ఇప్పుడు ధృవ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేసేశారు.

ఒకరకంగా ఇది హ్యాపీ న్యూసే అయినా.. మెగాఫ్యాన్స్ లో మరో టెన్షన్ పట్టుకుంది. హైద్రాబాద్ లోని యూసఫ్ గుడా దగ్గర ఉన్న పోలీస్ గ్రౌండ్స్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ అని చెప్పడంతో చాలా మందికి ఆశ్చర్యం వేసేసింది. ఇది మిగతా వాటిలాగే పెద్ద గ్రౌండ్ అయినా.. చాలానే విస్తీర్ణం ఉన్నా.. అసలు సమస్య అక్కడికి చేరుకోవడమే. ఆల్రెడీ ఫుల్ ఇరుకు రోడ్లు. పైగా ఇప్పుడు మెట్రో కడతుండటంతో.. మొత్తంగా తవ్వేసి గతుకులు. కొన్ని చోట్ల అతుకులు రూపంలో కొత్త తారు బిట్లను వేసినా కూడా.. ట్రాఫిక్ అంతా అద్వానంగా చెదిరిపోయేలా ఉన్న రోడ్లు. ఇప్పుడు పైగా ఇసుకతో నిండిపోయి.. రెండు వెహికల్స్ వెళితే చాలు.. మట్టితో మనకు ఫుల్ స్నానం అయిపోతుంది. ఇలాంటి రోడ్లను దాటుకుని వెళ్ళి పోలీస్ గ్రౌండ్స్ చేరుకోవాలి.

అలాంటి ప్లేస్ లో మెగా పవర్ స్టార్ మూవీకి ఈవెంట్ డిసైడ్ చేయడమంటే ఓ రకంగా రిస్క్ లాంటిదే. అంతలేసి ట్రాఫిక్ ను తప్పించుకుని ఈవెంట్ ప్లేస్ కి వెళ్లేసరికి.. అక్కడ కార్యక్రమం ఫినిష్ అయిపోయినా ఆశ్చర్యంలేదు మరి. అలాంటి ఇరుకైన ప్లేస్ లో ధృవ ఈవెంట్ చేస్తుండడం ఆశ్చర్యకరమే.

,  ,  ,  ,  ,