Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

30-Nov-2016 10:37:39
facebook Twitter Googleplus
Photo

రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ ధృవ.. రెడీ ఫర్ రిలీజ్. డిసెంబర్ 9న విడుదల కానున్న ఈ చిత్రం కోసం.. ఇప్పుడు ప్రమోషనల్ యాక్టివిటీస్ కూడా స్టార్ట్ చేసేశారు. మరోవైపు గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేసి.. వెన్యూ కూడా అనౌన్స్ చేశారు. యూసఫ్ గుడాలోని పోలీస్ గ్రౌండ్స్ లో ధృవ ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరగనుంది.

సిటీ మధ్యలో ఇంత ఇరుకైన ప్లేస్ లో నిర్వహించడంపై చాలామంది ఫ్యాన్స్ ఫీలవుతున్నారు కూడా. పోలీస్ గ్రౌండ్స్ లోనే ధృవ ఫంక్షన్ జరపడానికి ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయట. ఈ మూవీలో చరణ్ ఐపీఎస్ ఆఫీసర్ గా కనిపిస్తున్న సంగతి తెలిసిందే. పోలీసులు-క్రిమినల్స్ మధ్య సాగే ఆర్గనైజ్డ్ క్రైమ్ చుట్టూతా ధృవ తిరుగుతుంది. సినిమాలో పోలీసులను హైలైట్ చేస్తూ.. వారి గొప్పదనం చెప్పే సీన్స్ కూడా కొన్ని ఉంటాయి.

సమాజానికి ఎంతో మేలు చేస్తున్న పోలీసులకు థ్యాంక్స్ చెప్పడంలో భాగంగానే ధృవ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను పోలీస్ గ్రౌండ్స్ లో ప్లాన్ చేశారట. పలువురు ఐపీఎస్ లను ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తారని తెలుస్తోంది. కేవలం మెగా ఈవెంట్ మాదిరిగా కాకుండా.. పోలీసుల గొప్పదనాన్ని చాటి చెప్పే పలువురు మాట్లాడతారట. అలా ధృవ ఐపీఎస్ గా నటిస్తున్న రామ్ చరణ్.. పోలీస్ గ్రౌండ్స్ లోనే గ్రాండ్ ఈవెంట్ జరుపుకోనున్నాడు.

,  ,  ,  ,  ,  ,  ,