Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

14-Jul-2017 11:49:53
facebook Twitter Googleplus
Photo

దిల్ రాజు నుంచి ఈ యేడాది వరుసగా మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. మూడూ కూడా హిట్టేనని - మా సంస్థకి మరో హ్యాట్రిక్ లభించిందని ఆయన చెబుతున్నారు. అయితే దువ్వాడ జగన్నాథమ్ రిజల్ట్ వసూళ్ల విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆ విషయాన్ని కాసేపు పక్కనపెడితే ఈ యేడాది దిల్రాజు సినిమాలతో ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ కి మాత్రం బాగా నష్టాలొచ్చాయట. ఓ ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ టోకున దిల్ రాజు సంస్థలో రూపుదిద్దుకొంటున్న నాలుగు సినిమాల్ని కొనేశాడు.

అయితే వాటిలో నేను లోకల్ మాత్రమే లాభాలు తెచ్చిపెట్టింది. మిగిలిన మూడు సినిమాలకి పెద్దగా డబ్బులు రాలేదు. దాంతో డిస్ట్రిబ్యూటర్ భారీగా నష్టాల్ని చవిచూడల్సి వస్తోందట. త్వరలోనే రానున్న ఫిదా అక్కడ బంపర్ హిట్టయినా కూడా సదరు డిస్ట్రిబ్యూటర్ మాత్రం నష్టాల నుంచి గట్టెక్కలేడట. అందుకే దిల్ రాజు ఆ డిస్ట్రిబ్యూటర్ కి అండగా నిలిచేందుకు నాని సినిమా రైట్స్ ని తక్కువ ధరకే ఇస్తానని హామీ ఇచ్చినట్టు తెలిసింది. ప్రస్తుతం నానితో దిల్ రాజు `ఎమ్.సి.ఎ` అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ చిత్రం రైట్స్ ని రీజనబుల్ ప్రైస్ కి ఇచ్చేసి డిస్ట్రిబ్యూటర్ కి ఉపశమనం కలిగించాలనేది దిల్ రాజు ప్లాన్. సదరు డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజుకి చాలా కావల్సిన వ్యక్తి అట. అందుకే ఆయన కోసం మరిన్ని వెసులుబాట్లు కల్పిస్తూ భవిష్యత్తులోనూ తన సినిమాల రైట్స్ ని ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిసింది. నాని సినిమాలు ఓవర్సీస్ లో దుమ్ము రేపుతున్నాయి.

,  ,  ,  ,  ,