Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

22-Jun-2017 12:22:26
facebook Twitter Googleplus
Photo

ఇప్పుడంటే బాహుబలి ది కంక్లూజన్ సృష్టించిన రికార్డులు.. అందనంత ఎత్తులో ఉన్నాయి. కానీ ఈ సినిమా వచ్చే వరకూ మూవీ మేకర్స్ టార్గెట్ బాహుబలి ది బిగినింగ్ మాత్రమే. రికార్డులు అనేవి చిరస్థాయిగా నిలిచిపోయేవేమీ కాదు కాబట్టి.. ఏదో ఒక రోజున ఏ రికార్డ్ అయినా బద్దలయిపోవాల్సిందే. కానీ బాహుబలిని మించాలంటే.. అంతటి కంటెంట్ తో పాటు కాన్ఫిడెన్స్ కూడా మేకర్స్ లో ఉండాలి.

దిల్ రాజు నిర్మాణంలో అల్లు అర్జున్ హీరోగా.. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన డీజే- దువ్వాడ జగన్నాధం రేపే థియేటర్లలోకి వచ్చేస్తోంది. దీంతో మీడియాలో తెగ ప్రచారం చేసేస్తూ బిజీబిజీగా గడిపేస్తున్నాడు అల్లు అర్జున్. అలాగే యూట్యూబ్ లో కూడా లైవ్ లో పాల్గొన్నారు. ఈ సమయంలో సినిమా వర్కింగ్ స్టిల్స్ ను చూపించి.. అక్కడేం మాట్లాడుకుంటున్నారో చెప్పాలంటూ బన్నీని అడిగారు యాంకర్స్. దిల్ రాజు భుజంపై బన్నీ చెయ్యి వేసి ఏదో చెబుతున్న పిక్ పై.. బన్నీ చెప్పిన ఆన్సర్ ఆశ్చర్యపరిచింది. మనం ఎలాగైనా బాహుబలి రికార్డ్ కొడదాం అంటే.. తప్పుకుండా ట్రై చేద్దాం సార్ అన్నాను అని చెప్పాడు బన్నీ.

ఇక ఈ సినిమా షూటింగ్ సందర్భంగా రోజంతా నవ్వుకుంటూనే ఉన్నామని చెప్పిన బన్నీ.. ఆడియో ఫంక్షన్ లో తన కొడుకు అయాన్ ను చూసి అభిమానులు అరుస్తుంటే.. మీరు అనుకునేంత మంచోడు కాదు మావాడు అనుకున్నట్లు చెప్పాడు అల్లు అర్జున్.

,  ,  ,  ,  ,  ,