Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

12-Aug-2015 16:54:48
facebook Twitter Googleplus
Photo

పటాస్ - గంగ - బాహుబలి - రుద్రమదేవి 3డి ఇలా క్రేజీ ప్రాజెక్టులన్నీ దిల్రాజు ఖాతాలోనే. ఇప్పటికే వరుసగా మూడు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. దిల్రాజు జేబులు నింపాయి. నైజాం ఏరియా డిస్ట్రిబ్యూషన్ లో నేనే కింగ్ అని నిరూపించారు రాజుగారు. అయితే ఇదే రెజియన్ లో వేరొక సంస్థ కూడా ఎంతో కాలంగా క్రేజీ ప్రాజెక్టులు రిలీజ్ చేస్తూ దిల్ రాజుతో పోటీపడుతోంది. శ్రేష్ఠ మూవీస్ అధినేత సుధాకర్ రెడ్డి గ్లోబల్ మూవీస్ లో బోలెడన్ని భారీ ప్రాజెక్టుల్ని పంపిణీ చేశారు. అప్పట్లో దిల్ రాజు కు సరైన పోటీ వీళ్లే.

కానీ ఇటీవలి కాలంలో సుధాకర్ రెడ్డి పంపిణీలో జోరు తగ్గించారు. కొడుకు నితిన్ తనయ నిఖితారెడ్డి తో కలిసి సినిమా నిర్మాణంలోనే బిజీగా గడిపేస్తున్నారు. ప్రస్తుతం శ్రేష్ఠమూవీస్ లో అఖిల్ హీరోగా వినాయక్ దర్శకత్వంలో ఓ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ బిజీలో పడి క్రేజీ ప్రాజెక్టుల పంపిణీ మర్చిపోయారు. ఇది దిల్రాజుకు బాగా కలిసొచ్చింది. వరుసగా హిట్ సినిమాలన్నీ అతడి అకౌంట్ లోకే వెళుతున్నాయి. నితిన్ తన ఫ్రెండుని హీరోగా ప్రమోట్ చేయడానికి సీరియస్ ఎటెంప్ట్ చేస్తున్నాడు కాబట్టి తండ్రి సుధాకర్ రెడ్డి కూడా అటే దృష్టి సారించారు. ఇక త్రివిక్రమ్ తో చేసే సినిమాకు కూడా పాక్షికంగా పెట్టుబడులు వీరివేనట. సో ఇప్పుడప్పుడే ఈ బ్యాచ్ పంపిణీరంగంపై ఫోకస్ పెట్టదు.

ఆ లెక్కన చూసుకుంటే అసలు నైజాం ఏరియాలో ఇక దిల్ రాజుకు ఇప్పట్లో ఎదురు లేనట్టే. ఏ పెద్ద సినిమా అయినా ఈయనే రిలీజ్ చేసుకుంటున్నాడు హ్యాపీగా... అదీ లెక్క.

,  ,  ,