Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

23-Mar-2017 10:34:02
facebook Twitter Googleplus
Photo

సినిమా నిర్మాతలంటే పెద్ద పెద్ద హీరోలు సైతం.. ప్రొడ్యూసర్ గారా?అంటూ గౌరవంగా లేచి నిలబడి విష్ చేసే రోజులు పోయి చాలా కాలమే అయ్యింది. అగ్రహీరోలు కాల్షీట్లు ఇస్తే అదే పదివేలు అన్నట్లుగా మారి చాలాకాలమే అయ్యింది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా.. ప్రొడ్యూసర్ కి సెలబ్రిటీ క్రేజ్ ఉండటం అంత చిన్నవిషయం కాదు. ఇలాంటి వేళలోనూ సెలబ్రిటీ ఇమేజ్ తో ఉండే నిర్మాతలు ఎవరైనా ఉన్నారా? అంటే.. అందులో దిల్ రాజు మొదటి వరుసలో ఉంటుంది. ఆయన ప్రొడ్యూస్ చేసే సినిమాలంటే చాలు.. ఒకలాంటి క్రేజ్ ఆయన సొంతం. ఆయన ఏదైనా డబ్బింగ్ సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నారన్న వెంటనే.. ప్రేక్షకుల్లో ఆసక్తి వ్యక్తం కావటమే కాదు.. చిత్రపరిశ్రమ సైతం ఆ సినిమా మీద ఒక లుక్ వేస్తుంది.

అలాంటి దిల్ రాజు.. తాను ప్రొడ్యూస్ చేసే సినిమాల ఫంక్షన్లో ఆయన ప్రముఖంగా కనిపిస్తుంటారు. హీరో..హీరోయిన్.. దర్శకుడితో సరి సమానంగా ఆయన కనిపిస్తుంటారు.అలాంటి ఇమేజ్ సొంతం చేసుకున్న ఆయన.. తాజాగా ప్రొడ్యూస్ చేస్తున్న మణిరత్నం దర్శకత్వం వహించిన తమిళ్ డబ్బింగ్ మూవీ చెలియా ఆడియో ఫంక్షన్ రీసెంట్ గా హైదరాబాద్ లో జరిగింది.

రెగ్యులర్ గా తన మూవీస్ కు దిల్ రాజు చేసే హడావుడి మచ్చుకైనా కనిపించకపోవటం గమనార్హం. అయితే.. దీనికి కారణం ఆయన సతీమణి అనిత హఠ్మారణం చెందటం.. దీంతో డీప్ షాక్ లో ఉన్న దిల్ రాజు ఇంట్లో నుంచి బయటకు రావట్లేదు. వాస్తవానికి దిల్ రాజు బ్యానర్ మీద రిలీజ్ కావాల్సిన వెళ్లిపోమాకే చిత్రాన్ని కూడా విడుదల వాయిదా వేశారు.

అయితే.. ఏప్రిల్ ఏడున విడుదల కావాల్సిన చెలియాకు తప్పనిసరి పరిస్థితుల్లో ఆడియో ఫంక్షన్ చేయక తప్పలేదన్న మాట వినిపిస్తోంది.రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న వేళ.. సినిమా ప్రమోషన్ వర్క్ షురూ చేయాల్సిన నేపథ్యంలో ఆడియో ఫంక్షన్ ను నిర్వహించినట్లుగా చెబుతున్నారు. భార్య పోయిన బాధలో ఉన్న దిల్ రాజు..తాజా ఫంక్షన్ ను స్కిప్ చేసినట్లుగా చెబుతున్నారు. దీంతో.. ఆయన లేని లోటు చెలియా ఆడియో ఫంక్షన్లో కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోందన్న మాట వినిపిస్తోంది

,  ,  ,  ,  ,  ,  ,  ,  ,