Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

14-Feb-2017 16:03:15
facebook Twitter Googleplus
Photo

పోయినేడాది సుప్రీమ్ సినిమాతో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కాడు దిల్ రాజు. ఈ ఏడాది శతమానం భవతి నేను లోకల్ చిత్రాలతో తిరుగులేని విజయాలనందుకున్నాడు. ఈ రెండు సినిమాలూ కలిపి ఓ రూ.20 కోట్ల దాకా రాజుకు లాభం తెచ్చిపెట్టి ఉంటాయని అంచనా. మరోవైపు డిస్ట్రిబ్యూటర్ గానూ కొంత కాలంగా రాజు హవా నడుస్తోంది. ఆయన జడ్జిమెంట్ స్కిల్స్ గురించి అందరూ గొప్పగా చెప్పుకుంటున్నారు. ఇలాంటి టైంలో రాజుకు ఒక పంచ్ పడింది. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఓం నమో వేంకటేశాయను రాజే నైజాం ఏరియాలో డిస్ట్రిబ్యూట్ చేశాడు. కాంబినేషన్ క్రేజ్.. సినిమా మీద ఉన్న పాజిటివ్ బజ్ చూసుకుని ఈ చిత్రాన్ని రూ.8.5 కోట్లకు తీసుకున్నాడు రాజు.

కానీ ఓం నమో వేంకటేశాయ బాక్సాఫీస్ పెర్ఫామెన్స్ పేలవంగా ఉంది. తొలి వారాంతంలో ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.6.5 కోట్ల షేర్ మాత్రమే రాబట్టింది. నైజాంలో షేర్ రూ.2 కోట్లకు కూడా చేరలేదు. ఫుల్ రన్లో ఈ సినిమా నైజాంలో రూ.5 కోట్లు రాబట్టడం కూడా కష్టంగానే ఉంది. అంటే రాజుకు సగానికి సగం నష్టం తప్పదని అనుకోవాలి. అలాగని ఈ నష్టాన్ని రాజే భరిస్తాడనుకుంటే పొరబాటే. నైజాం హక్కుల్ని అడ్వాన్స్ కింద తీసుకున్నాడు రాజు. అంటే నష్టం వస్తే అది డిస్ట్రిబ్యూటర్ భరించాల్సిన పని లేదు. నిర్మాత అకౌంట్లోకే వెళ్తుంది. మిగతా ఏరియాల డిస్ట్రిబ్యూటర్లందరూ నో రిటర్న్స్ పాలసీ కింద హక్కులు తీసుకున్నారు. కాబట్టి వాళ్లందరూ నష్టాల్ని భరించక తప్పదు. ఇక్కడ కూడా దిల్ రాజు తన ప్రత్యేకత చూపించాడు. అనుభవాన్ని రంగరించి అడ్వాన్స్ పాలసీలో హక్కులు తీసుకుని సేఫ్ అయిపోయాడు. ఇది చూసి దిల్ రాజు తెలివే తెలివి అని పొగిడేస్తున్నారు ఇండస్ట్రీ జనాలు.

,  ,  ,  ,