Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

07-Jun-2016 15:43:50
facebook Twitter Googleplus
Photo

ఓ సినిమా హిట్టయితే దర్శక నిర్మాతలు ప్రెస్ మీట్ పెట్టి తమ సంతోషాన్ని షేర్ చేసుకోవడం మామూలే. ఐతే ఓ డిస్ట్రిబ్యూటర్ సైతం ప్రత్యేకంగా విలేకరుల సమావేశం నిర్వహించి తన సంతోషాన్ని వ్యక్తం చేయడం.. ఆ సినిమా సక్సెస్ గురించి గొప్పగా మాట్లాడ్డం అరుదైన విషయం. ?అఆ? సినిమా విషయంలో ఇదే జరిగింది. ఐతే ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టింది మామూలు వ్యక్తి కాదులెండి. పెద్ద నిర్మాత కూడా అయిన దిల్ రాజు. ?అఆ? సినిమాను నైజాం ఏరియాలో డిస్ట్రిబ్యూట్ చేసింది ఈయనే. ప్రివ్యూలు చూసి జడ్జిమెంట్లు చెప్పడంలో కింగ్ అయిన రాజు.. ?అఆ? కూడా అలాగే చూశాడు. సినిమా పిచ్చగా నచ్చేసి.. రూ.8 కోట్ల ఫ్యాన్సీ రేటు ఇచ్చి ?అఆ?ను నైజాంలో డిస్ట్రిబ్యూట్ చేశాడు.

ఈ సినిమా నైజాం సహా అన్ని ఏరియాల్లోనూ అద్భుతమైన కలెక్షన్లు సాధిస్తున్న నేపథ్యంలో రాజు.. ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టాడు. తాను రూ.8 కోట్లు పెట్టి నైజాం హక్కులు కొంటే.. ఇప్పటికే ఈ సినిమా రూ.12 కోట్ల దాకా గ్రాస్ వసూలు చేసినట్లు రాజు వెల్లడించాడు. తెలంగాణ ప్రేక్షకులకు ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారన్నాడు. అన్ని చోట్లా బయ్యర్లు తొలి వారంలోనే లాభాల బాట పడుతున్నారని.. అమెరికాలో ?అఆ? ఆల్రెడీ 2 మిలియన్ క్లబ్బులో అడుగుపెట్టి సంచలనం సృష్టించిందని రాజు తెలిపాడు. ?అఆ? ఫుల్ రన్లో రూ.60 కోట్ల షేర్ వసూళ్లు సాధించవచ్చని రాజు అంచనా వేశాడు. నితిన్ కెరీర్లోనే ఇది బిగ్ బడ్జెట్ ఫిల్మ్ అని.. బిగ్గెస్ట్ గ్రాసర్ గానూ నిలుస్తోందని రాజు చెప్పాడు.

,  ,  ,  ,  ,  ,