Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

08-Aug-2017 15:13:32
facebook Twitter Googleplus
Photo

పది జిల్లాల్లో థియేటర్ కావాలంటే ఎవరైన సరై ఆ మూవీ డాన్ ఉండే డెన్ తలుపు తట్టాల్సిందే. ఇదే ఏరియాలో డిస్ట్రీబ్యూట్ చేస్తామంటూ కొన్ని ఏజెన్సీలు తిరిగినా వాటికి కూడా ఆ రాజుగారే థియేటర్లు ఇవ్వాల్సిన పరిస్థితి. స్వతహాగా సినీ నిర్మాతగా వ్యవహరించే ఆ పెద్ద మనిషి - పంపిణీదారుడిగా - ఎగ్జీబిటర్ గా కూడా కొనసాగుతున్నాడు. నైజాం ఏరియా మొత్తం తన హస్త గతం చేసుకొని తను నిర్మించే సినిమాలు హిట్ అయితే వాటిని ఎక్కువు రోజులు థియేటర్స్ లో ఉంచడం వేరే సినిమాలు హిట్ అయినా సరే కొత్త సినిమాలు వస్తే వాటిని పక్కపెట్టేయడం ఆ పెద్ద మనషికి షరా మాములే.

ఆగస్ట్ 11న ఒకే సారి మూడు సినిమాలు రిలీజ్ అవుతుండటంతో అందరి దృష్టి ఇప్పుడు ఆ పెద్ద మనిషి పై పడింది. వ్యాపార రీత్య నైజాం ఏరియా నుంచి ఎక్కువగా ఆదాయం వస్తుంది. దీంతో ఈ మూడు సినిమాల నిర్మాతలు తమ ప్రాజెక్టుల్ని ఆ పెద్ద మనిషి చేతిలో పెట్టేశారు. ఇందులో లై సినిమా వాళ్లు మెన్నటివరకు వెనుకంజ వేసినా తాజాగా సుధాకర్ రెడ్డి వెళ్లి ఆ రాజుగారిని కలిసి నైజాం లో లై కు సపోర్ట్ చేయాల్సిందిగా కోరాడట. ఇక ఇప్పటికే బోయపాటి ఆ డాన్ తో డీల్ కుదుర్చుకున్నట్లు తెలిసింది. సురేశ్ ప్రొడక్షన్స్ తో ఆ రాజుగారికి ఎప్పటి నుంచో సత్ససంబధాలు నెలకొన్నాయి.

,  ,  ,  ,  ,  ,