Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

10-May-2016 13:24:39
facebook Twitter Googleplus
Photo

గత ఏడాది సౌత్ ఇండియన్ యూత్ ఆడియన్స్ అందరినీ ప్రేమలో పడేసిన సినిమా ?ప్రేమమ్?. ఈ చిత్రాన్ని తెలుగులో అదే పేరుతో నాగచైతన్య కథానాయకుడిగా యువ దర్శకుడు చందూ మొండేటి రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఓ యువకుడి యవ్వన దశలో తొలి ప్రేమ మొదలు.. అతడి పెళ్లి వరకు వివిధ దశల్ని చూపించే సినిమా ఇది. ముగ్గురు కథానాయికలుంటారు.

హీరో ఫస్ట్ లవ్ స్టోరీ కోసం మలయాళంలో నటించిన అనుపమ పరమేశ్వరన్ నే తీసుకున్నాడు చందూ. సాయిపల్లవి పోషించిన లెక్చరర్ పాత్రకు మాత్రం శ్రుతి హాసన్ ను ఎంచుకున్నాడు. ఇక హీరో చివర్లో పెళ్లాడే అమ్మాయి విషయంలోనే కొంచెం సస్పెన్స్ నడుస్తోంది. మధ్యలో రకుల్ ప్రీత్ సింగ్ పేరు వినిపించింది కానీ.. తర్వాత అది అబద్ధమని తేలిపోయింది. మలయాళ ఒరిజినల్లో నటించిన మడోన్నా సెబాస్టియనే తెలుగులోనూ నటిస్తుందని వార్తలొచ్చాయి కానీ కన్ఫర్మేషన్ లేదు.

ఐతే ఎట్టకేలకు ఈ విషయంలో క్లారిటీ వచ్చేసింది. మలయాళ బ్యూటీ మడోన్నానే తెలుగులోనూ ఆ పాత్ర చేస్తోంది. చివర్లో వచ్చే పెళ్లి సన్నివేశానికి సంబంధించిన ఫొటో నెట్లోకి వచ్చేసింది. చైతూ-మడోన్నా రిసెప్షన్లో నిలబడి ఉన్న ఫొటో ప్రస్తుతం నెట్లో హల్ చల్ చేస్తోంది. ఇటీవలే ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన సన్నివేశాల్ని రామోజీ ఫిలిం సిటీలో చిత్రీకరించాడు చందూ మొండేటి. దీంతో ?ప్రేమమ్? టాకీ పార్ట్ మొత్తం పూర్తయిందట. ప్రస్తుతం పాటల చిత్రీకరణ నడుస్తోది. జులైలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశముంది.

,  ,  ,  ,  ,  ,  ,