పవర్ సినిమాతో తెలుగు పరిశ్రమకు దర్శకుడిగా మంచి ఎంట్రీ ఇచ్చిన బాబీ, ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను డైరెక్ట్ చేసే అవకాశం సొంతం చేసుకొని అప్పట్లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయారు. అయితే పవన్ హీరోగా బాబీ తెరకెక్కించిన ?సర్దార్ గబ్బర్ సింగ్? సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం పాలవ్వడంతో బాబీకి మొదట్లో వచ్చిన క్రేజ్ అంతా పోయింది. ఇక ఈ నేపథ్యంలోనే బాబీ తన కొత్త సినిమాను మళ్ళీ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు.
ఈ క్రమంలోనే మాస్ మహరాజ్ రవితేజతో ఓ సినిమా ప్లాన్ చేస్తోన్న బాబీ, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కోసం కూడా ఓ కథ సిద్ధం చేశారట. ఇక ఈ కథను బన్నీ కూడా మెచ్చినట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతానికి ఇంకా చర్చల దశలోనే ఈ కాంబినేషన్ ఉంది. అన్నీ కుదిరితే బన్నీ ఈ సినిమాకు ఓకే చెప్పే అవకాశాలే ఎక్కువున్నాయని సమాచారం.