Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

19-Jan-2017 10:40:40
facebook Twitter Googleplus
Photo

చిరంజీవి సినిమా ఖైదీ నెంబర్ 150 రికార్డుల మోత మోగిస్తోంది. బాలయ్య సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి కూడా కలెక్షన్లు అదరగొడుతోంది. రేసులోకి లేటుగా వచ్చిన శతమానం భవతి మంచి వసూళ్లు రాబడుతోంది. కానీ సంక్రాంతి బరిలో నిలిచిన మరో సినిమా హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య సంగతే ఎవరూ పట్టించుకోవడం లేదు. తమ సినిమాకు థియేటర్లివ్వట్లేదని నారాయణమూర్తి అండ్ కో ఎంతగా గగ్గోలు పెట్టినా పరిస్థితిలో పెద్దగా మార్పేమీ రాలేదు. ఈ చిత్రానికి తెలంగాణ వరకు 23 థియేటర్లిచ్చారట. ఆంధ్రప్రదేశ్ లో ఒక్కటంటే ఒక్క థియేటర్ కూడా ఇవ్వలేదంటూ ప్రెస్ మీట్ పెట్టి మరోసారి వాపోయాడు నారాయణమూర్తి. 13 జిల్లాల్లో ఒక్కటంటే ఒక్క థియేటర్ కూడా ఇవ్వకపోవడం అన్నది కచ్చితంగా ఆవేదన కలిగించే విషయమే. ఈ నేపథ్యంలోనే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జోక్యం చేసుకుని చిన్న సినిమాలకు థియేటర్లిచ్చే విషయమై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు నారాయణమూర్తి. ఆయన వేదన అర్థం చేసుకోదగ్గదే. ఆయన సినిమాకు తలెత్తిన పరిస్థితి బాధ కలిగించేదే.

కానీ ఇక్కడో చిన్న లాజిక్ గురించి మాట్లాడుకోవాలి. టాలీవుడ్లో థియేటర్లు కొందరి గుప్పెట్లో ఉన్న మాట వాస్తవమే. వాళ్లు తమ సినిమాలకే థియేటర్లను అట్టిపెట్టుకునే మాటా వాస్తవమే. కానీ ఒక సినిమా బాగుంది అంటే.. దానికి థియేటర్లు ఇవ్వక తప్పదు. గత ఏడాది ?పెళ్లి చూపులు? అనే సినిమా రిలీజైంది. ముందు తక్కువ థియేటర్లలోనే రిలీజ్ చేశారు. కానీ సినిమాకు మంచి టాక్ రావడంతో థియేటర్ల సంఖ్య బాగా పెరిగింది. సినిమా బాగుందంటే.. జనాల్లో ఆసక్తి ఉందంటే థియేటర్లు కేటాయించక తప్పదు. ఏడాది చివర్లో అప్పట్లో ఒకడుండేవాడు కు కూడా ఇలాంటి పరిస్థితే తలెత్తింది. కానీ సినిమాకు అద్భుతమైన టాక్ రావడంతో రెండో వారానికి థియేటర్లు పెంచక తప్పలేదు. ఇప్పుడు హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య సినిమాను స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చదలవాడ శ్రీనివాసరావు.. గత ఏడాది బిచ్చగాడు అనే అనువాద చిత్రాన్ని రిలీజ్ చేశాడు. ఆ సినిమా కోసం ఎగ్జిబిటర్లు ఎలా ఎగబడ్డారో.. పెద్ద పెద్ద సినిమాల్ని కూడా పక్కనబెట్టి దాన్ని ఎలా ఆడించారో గుర్తుండే ఉంటుంది. టాలీవుడ్లో థియేటర్ల గూడుపుఠాని ఉందన్నది వాస్తవం. అదే సమయంలో సినిమా బాగుంటే ఎవ్వరైనా థియేటర్లు ఇవ్వక తప్పదు. అలాంటి పరిస్థితిని ?హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య? కల్పించిందా అన్నదే ఇప్పుడు ప్రశ్న. సంక్రాంతికి క్రేజీ సినిమాలు రిలీజవుతున్నాయని.. జనాల ఫోకస్ అంతా వాటి మీదే ఉందని తెలిసినా.. ప్రతిష్టకు పోయిన ఈ సినిమాను రిలీజ్ చేయడం కరెక్టా అన్నది కూడా ఆలోచించాలి.

,  ,  ,  ,  ,