Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

13-Apr-2016 11:51:48
facebook Twitter Googleplus
Photo

గబ్బర్ సింగ్.. కలెక్షన్ల విషయంలో రెండో స్థానంలో వున్నా పవన్ అభిమానులకు ఆయన సినిమాలలో మేటి చిత్రంగా నిలిచింది. ఆ సినిమాలో తీసిన ఒక్కో సీన్ - రాసిన ఒక్కో డైలాగ్ పవన్ కోసమే పుట్టిందా అన్నంత యాప్ట్ గా అతికినట్టు సరిపోయి అభిమానుల్ని ఖుషి చేశాయి.

అయితే ఈ చిత్రానికి ముందు హరీష్ రవితేజ తో మిరపకాయ్ సినిమా తీసి హిట్ కొట్టాడు. ఇప్పుడు సర్దార్ గబ్బర్ సింగ్ డైరెక్టర్ బాబీ సైతం తన మునుపటి చిత్రం రవితేజతో పవర్ అని హిట్ సాధించాడు. సో ఈ రవితేజ తరువాతి మూవీ సెంటిమెంట్ వర్క్ అవుట్ అవుతుందని ఆశించినవారికి నిరాశే మిగిలింది. సర్దార్ ఫ్లాప్ టాక్ తెచ్చుకుని కలెక్షన్ల వేటలో వెనుకడుగు వేసింది.

అయితే ఈ సెంటిమెంట్ వర్క్ అవ్వలేదు గానీ టాలీవుడ్ ని కుదిపేస్తున్న ద్వితీయ విఘ్నం సెంటిమెంట్ మరోసారి వర్క్ అయ్యింది. బాబీ రెండవ సినిమాగా తెరకెక్కిన సర్దార్ ఫ్లాపవ్వడంతో ఈ సెంటిమెంట్ పై మరింత నమ్మకం పెరిగింది.

,  ,  ,  ,  ,