Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

28-Jun-2017 10:16:05
facebook Twitter Googleplus
Photo

ఎవరైనా ఒక హీరో ఒక తరహా పాత్రలో నటించి మెప్పిస్తే.. ఆ తర్వాత ఇంకో హీరో అదే తరహా పాత్ర వేస్తే ఆటోమేటిగ్గా ప్రేక్షకుల్లో పోలిక రావడం సహజం. ఆ హీరో ఎలా చేశాడు.. ఈ హీరో ఎలా మెప్పించాడని పోల్చి చూసి ఎవరు బాగా చేశారో ఒక అభిప్రాయానికి రావడం మామూలే. ముందు ఒక హీరో ఒక బెంచ్ మార్క్ సెట్ చేసినపుడు.. తర్వాత ఇంకో హీరో దానికి దీటుగా పెర్ఫామ్ చేయాలని.. ఇంకా బెటర్ పెర్ఫామెన్స్ ఇవ్వాలని ప్రేక్షకులు ఆశించడంలో తప్పేముంది? కానీ ఇది చాలా పెద్ద తప్పు అన్నట్లు మాట్లాడుతున్నాడు హరీష్ శంకర్. అతడి దర్శకత్వంలో తెరకెక్కిన దువ్వాడ జగన్నాథంలో అల్లు అర్జున్ బ్రాహ్మణ కుర్రాడి పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.

ఐతే ఇంతకుముందు ముగ్గురు మొనగాళ్లులో చిరంజీవి.. అదుర్స్ లో ఎన్టీఆర్ బ్రాహ్మణ కుర్రాడి పాత్రలో అదరగొట్టారు. ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందించారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ నుంచి కూడా అలాంటి పెర్ఫామెన్సే ఆశించారు ప్రేక్షకులు. ఈ విషయంలో బన్నీ అంచనాల్ని అందుకోలేకపోయాడు. ఓవరాల్ గా ఓకే అనిపించినా.. బ్రాహ్మణ కుర్రాడి పాత్రలో చిరు.. ఎన్టీఆర్ ల మాదిరిగా అలరించలేకపోయాడు. ఇదే అభిప్రాయం సమీక్షల్లో వ్యక్తమైంది. సోషల్ మీడియాలో సామాన్య ప్రేక్షకులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఐతే బన్నీని గతంలో బ్రాహ్మణ కుర్రాడి పాత్రలు చేసిన హీరోలతో ఎలా పోలుస్తారంటూ డీజే థ్యాంక్స్ మీట్లో క్లాస్ పీకే ప్రయత్నం చేశాడు హరీష్. ఓవైపు రివ్యూయర్ల మీద పడిపోయి.. మరోవైపు ఇలా పోలికలు తెచ్చిన వాళ్ల మీద పడిపోయి.. అసలు తమ సినిమా గురించి నెగెటివ్ గా మాట్లాడటం పెద్ద నేరం అన్నట్లుగా చెలరేగిపోయాడు హరీష్. డీజే కు కాలం కలిసొచ్చి టాక్ తో సంబంధం లేకుండా వీకెండ్లో వసూళ్లు బాగున్నంత మాత్రాన మరీ ఇంతగా అటాక్ చేయాలా అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది జనాల్లో.

,  ,  ,  ,  ,  ,  ,