Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

24-Apr-2015 10:19:17
facebook Twitter Googleplus
Photo

హైదరాబాద్ నగరాన్ని ఒకవైపున ఎండలు ... మరోవైపున వానలు పలకరిస్తున్నాయి. అలాగే ఒక వైపున ఈ సీజన్ లో ప్రేక్షకులను పలకరించడానికి కొన్ని సినిమాలు సిద్ధమవుతూ వుంటే, మరికొన్ని సినిమాలు షూటింగులతో హైదరాబాద్ లో సందడి చేస్తున్నాయి. అలాంటి సినిమాల జాబితాలో 'బెంగాల్ టైగర్' సినిమా కూడా ఉంది. ఈ సినిమాకి సంబంధించిన యాక్షన్ ఎపిసోడ్ ని కథానాయకుడు రవితేజాతో పాటు మరికొందరిపై శంషాబాద్ లో చిత్రీకరిస్తున్నారు. ఆడియన్స్ కి ఆసక్తిని కలిగించే విధంగా ... రవితేజా స్టైల్ కి తగినట్టుగా ఈ యాక్షన్ ఎపిసోడ్ ను ప్లాన్ చేశారు.

దర్శకుడు సంపత్ నంది తనదైన శైలిలో ఈ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నాడు. ఈ రెండవ షెడ్యూల్ కి సంబంధించిన కొన్ని కీలకమైన సన్నివేశాలను రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరించనున్నారు. ఇందులో తమన్నా .. రాశిఖన్నా పాల్గొననున్నట్టు తెలుస్తోంది. రవితేజా బాడీ లాంగ్వేజ్ కి తగిన కథ .. అందాల కథానాయికల కాంబినేషన్ .. పవర్ ఫుల్ టైటిల్ ... సంపత్ నంది మేకింగ్ ఈ సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి. రాధామోహన్ నిర్మిస్తోన్న ఈ సినిమాను సెప్టెంబర్ 17న ప్రేక్షకుల ముందుకి తీసుకురావాలనే ఆలోచనలో వున్నారు.

,  ,  ,  ,