Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

13-Mar-2017 16:26:05
facebook Twitter Googleplus
Photo

దర్శకుడు క్రిష్ ఇప్పుడు ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. ఇప్పటివరకూ కేవలం ప్రశంసలు మాత్రమే అందుకునే ఈ దర్శకుడు.. తాజాగా గౌతమిపుత్ర శాతకర్ణి మూవీతో కమర్షియల్ సక్సెస్ అందుకున్నాడు. ఆ తర్వాత ముంబై వెళ్లి కొన్ని యాడ్ ఫిలిం షూటింగ్స్ పాల్గొన్న క్రిష్.. కొత్త సినిమాకి ప్రిపేర్ అవుతున్నాడు.

వెంకటేష్ 75వ చిత్రాన్ని క్రిష్ చేద్దామని భావించి.. అనౌన్స్ మెంట్ కూడా చేశాడు కానీ.. ఈ ప్రాజెక్టు ఇప్పుడు రద్దయిపోయింది. ఓ మీడియం రేంజ్ హీరోతో సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడు ఈ దర్శకుడు. ఇప్పుడీ ప్రాజెక్టుకు టైటిల్ రిజిస్టర్ చేయించేశాడు కూడా. ఏ ప్రాజెక్టుకు అయినా.. అనౌన్స్ మెంట్ కంటే ముందే టైటిల్ ను డిసైడ్ చేసేసి రిజస్ట్రేషన్ చేసేయడం క్రిష్ కు అలవాటు. అలాగే ఇప్పుడు చోర అనే టైటిల్ ను రిజస్టర్ చేశాడు క్రిిష్.

టైటిల్ వినగానే ఇప్పటివరకూ క్రిష్ తీసిన జోనర్లకు విభిన్నమైన యాంగిల్ ను టచ్ చేయబోతోన్నాడనే సంగతి అర్ధమవుతోంది.

,  ,  ,  ,  ,  ,