Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

06-Aug-2016 13:46:33
facebook Twitter Googleplus
Photo

విజయ్ ఆంటోనీ. గత కొన్ని నెలలుగా తెలుగు ఇండస్ట్రీలో బాగా వినిపిస్తున్న పేరు. స్వతహాగా తమిళ పరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేసిన విజయ ఆంటోనీ తరువాత నటుడుగా, దర్శకుడిగా మారారు. ఆయన తాజాగా దర్శకత్వం వహించిన పిచైక్కారన్ చిత్రం తమిళంలో సూపర్ హిట్టై తెలుగులోకి బిచ్చగాడు పేరుతో విడుదలై సంచలనం విజయం అందుకుంది.
సర్దార్ గబ్బర్ సింగ్, బ్రహ్మోత్సవం వంటి భారీ చిత్రాలు విడుదలైనప్పటికీ వాటన్నింటినీ తట్టుకుని 100 రోజులు పూర్తి చేసుకుని ఇప్పటికీ కొన్ని థియేటర్లలో నడుస్తోంది. ఈ చిత్రం ఒక తెలుగులోనే రూ. 25 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ ఉత్సాహంతోనే ఆంటోనీ తన తరువాతి తమిళ సినిమా ?సైతాన్? ను తెలుగులో ?బేతాళుడు? పేరుతో విడుదల చేస్తున్నాడు. ఈ చిత్రం తమిళం, తెలుగు భాషల్లో ఒకేసారి విడుదలకానుంది. అలాగే విజయ్ ఆంటోనీ ప్రస్తుతం కమిటైన అన్ని ప్రాజెక్టులు పూర్తవగానే డైరెక్ట్ తెలుగుసినిమా చేసే ప్రయత్నాల్లో కూడా ఉన్నాడు.

,  ,  ,  ,  ,