Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

09-Jun-2017 13:22:33
facebook Twitter Googleplus
Photo

సూపర్ స్టార్ మహేశ్ బాబు అభిమానులుకు ఒక శుభవార్త. అది ఏంటంటే అతని స్పైడర్ సినిమా ఎంతవరకు వచ్చిందీ ఇప్పుడు మురుగుదాస్ చెప్పేశాడు. ఎంతో లేట్ అవుతుందేమో అనుకుంటుండగా.. ఈ సినిమా షూటింగ్ స్టేటస్ అప్డేట్స్ అన్నీ మురుగుదాస్ చెప్పడం విశేషం.

ఇప్పటికే దాదాపుగా స్పైడర్ షూటింగ్ పూర్తి అయ్యింది. మరో 10 రోజులు షూటింగ్ మిగిలి ఉందని రెండు పాటలు చిత్రీకరణ భాకీ ఉందని చిత్ర దర్శకుడు ఏ ఆర్ మురుగదాస్ చెప్పాడు. మిగతా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఇప్పటికే మొదలుపెట్టారట. సో సెప్టెంబర్ నెలలో ఖచ్చితంగా చెప్పిన తేదీకే స్పైడర్ వచ్చేస్తుందనమాట. ఇకపోతే మహేశ్ బాబు గురించి ఇలా అన్నాడు మురుగుదాస్. “మహేశ్ బాబు మంచి అంకితభావం ఉన్న నటుడు డైరెక్టర్ చెప్పినట్లు వినే మంచి స్టూడెంట్. ఆయనతో పని చేసినప్పుడు ఒక సూపర్ స్టార్ తో చేస్తున్న భావనే రాకుండా చూసుకున్నారు. వినయం కలుపుగోలుతనం అతని నిరాడంబరం నాకు బాగా నచ్చిన విషయాలు. నాతోనే కాదు సెట్ లో ఉన్న అందరితోనూ ఆయన అతను అలానే ఉంటాడు'' అని సెలవిచ్చాడు.

స్పైడర్ సినిమా యాక్షన్ థ్రిల్లర్ గా నిర్మిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమాలో మహేశ్ కు జంటగా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుంది. ఠాగోర్ మధు మరియు ఎన్వి ప్రసాద్ ఇద్దరు కలిసి ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు.

,  ,  ,  ,  ,