Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

03-Apr-2017 10:22:57
facebook Twitter Googleplus
Photo

ఒకప్పుడు టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్. పూరీ పరిచయం చేస్తే హీరో అయినా హీరోయిన్ అయినా టాప్ రేంజ్ కి వెళ్లాల్సిందే. హీరోలకు హీరోయిజం ఆపాదించడంలో.. హీరోయిన్స్ తో అందాలు ఒలికించడంలో ఈ దర్శకుడు స్టైలే వేరు. అయితే.. ఇవన్నీ అప్పుడెప్పుడో పూరీ ఇలా అని చెప్పుకోవాల్సి వస్తోంది.

పూరీ నుంచి ఆశించిన స్థాయిలో కాదు కదా.. ఇది పూరీ సినిమా అని చెప్పుకునేట్లుగా కనీస స్థాయిలో కూడా స్టాండర్డ్స్ ఉండడం లేదు. రీసెంట్ గా వచ్చిన రోగ్ మూవీని అయితే.. పూరీ సినిమాల కోసం ఇకపై అభిమానులు ఆశలు పెట్టుకోవాల్సిన పని లేదు అని చెప్పినట్లుగా తీసేశాడు. ఇలా డిజప్పాయింట్ చేయడం అనే పాయింట్లో మాత్రం అచ్చు గుద్దినట్లుగా తన గురువు రాంగోపాల్ వర్మను ఫాలో అయిపోతున్నాడు ఈ దర్శకుడు. వర్మ పొజిషన్ కూడా ఇలానే దిగజారింది. శివ అంటూ ఒక్క సినిమాతోనే ఇండియన్ సినిమాల ట్రెండ్ మార్చేసిన వర్మ.. ఆ తర్వాత ఇండియన్ స్క్రీన్ ఎరుగని ఎన్నో వింతలను చూపించాడు.

వర్మ సినిమా అంటే ఏదో ఒకటి కొత్తగా ఉంటుందని జనాల బ్రెయిన్ లో ఫిక్స్ అయిపోయేలా చేశాడు. కానీ ఓ దశాబ్దానికి పైగా వర్మ తీసిన సినిమాలు.. అభిమానులను నిరుత్సాహపరచడమే కాదు.. భయపెట్టేశాయి కాదు. హారర్ సినిమాలు తీసి భయపెట్టాలన్నది వర్మ డ్రీమ్ అయితే.. వర్మ సినిమా అంటే భయపడే రేంజ్ కి తీసుకొచ్చేశాడు.

,  ,  ,  ,  ,