Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

14-Jul-2016 10:41:11
facebook Twitter Googleplus
Photo

హైదరాబాద్ : దగ్గుపాటి వెంకటేష్, రానా కంబినేషన్ లో మనం తరహాలో ఓ మల్టిస్టారర్ రాబోతోందంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అలాగే ఈ చిత్రాన్ని క్షణం దర్శకుడు రవికాంత్ పేరేపు డైరక్ట్ చేస్తున్నారని సైతం నిన్నంతా మీడియాలో ప్రచారం జరిగింది. అయితే అలాంటిదేమీ లేదని ఖండించారు రవికాంత్. రవికాంత్ మాట్లాడుతూ.. "నేను దగ్గుపాటి హీరోలకు ఏ స్క్రిప్టునూ నేరేట్ చెయ్యలేదు. నేను ప్రస్తుతం రాస్తున్న స్క్రిప్టుని ఫినిష్ చేసే పనిలో ఉన్నాను...త్వరలోనే నా తదుపరి చిత్రం ఎనౌన్సమెంట్ వస్తుంది ", అన్నారు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం రానా కు ఈ దర్శకుడు ఓ కథని నేరేట్ చేసాడని, అయితే ఆ ప్రాజెక్టు కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా లేదాని తెలియాలి. అయితే అది మల్టిస్టారర్ కథ మాత్రం కాదని వినికిడి. ఇక ప్రస్తుతం రానా..బాహుబలి 2 బిజీలో ఉన్నారు. దాంతో పాటు రానా హీరోగా నటించిన 'ఘాజీ' చిత్రం కోసం ఆయన అభిమానులు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. తెలుగు .. హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ప్రస్తుతం ఈ రెండు వెర్షన్స్ కి సంబంధించిన డబ్బింగ్ పనులు జరుగుతున్నాయి. సాధ్యమైనంత త్వరగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో దర్శక నిర్మాతలు వున్నారు.

,  ,  ,  ,  ,