Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

02-Dec-2014 16:12:49
facebook Twitter Googleplus
Photo

పవన్ కల్యాణ్ ప్రస్తుతం పవిత్ర పుణ్యక్షేత్రం వారణాసిలో బస చేశాడు. 'గోపాల గోపాల' సినిమా షూటింగు కోసం ఆయన కాశీ పట్టణంలో వున్నాడు. ఆయనపై ఓ ప్రత్యేకమైన పాటను అక్కడ చిత్రీకరిస్తున్నారు. నిన్నటి నుంచి జరుగుతున్న ఈ చిత్రీకరణ ఐదు రోజుల పాటు కొనసాగుతుంది. దీంతో షూటింగుకు సంబంధించి ఇక వారం రోజుల టాకీ మాత్రం మిగులుతుంది. అక్కడి నుంచి యూనిట్ తిరిగి రాగానే ఈ బ్యాలెన్స్ వర్క్ పూర్తి చేస్తారు. వెంకటేష్, పవన్ కలసి నటిస్తున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి పండుగకు రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. కాగా, ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా మోషన్ పోస్టర్ కి విశేషమైన ఆదరణ లభిస్తోంది.

,  ,  ,  ,  ,  ,