Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

01-May-2017 11:11:35
facebook Twitter Googleplus
Photo

సౌత్ ఇండియన్ సినిమా అంటే ఏంటో చూపించిన దర్శకుడు శంకర్. బాలీవుడ్ వాళ్లు కూడా అబ్బుర పడేలా అంతర్జాతీయ స్థాయిలో సౌత్ సినిమాకు గుర్తింపు తెచ్చిన దర్శకుడతను. దక్షిణాదిన ఎంతోమంది దర్శకులకు శంకర్ స్ఫూర్తిగా నిలిచాడు. ఆయన్ని చూసి స్ఫూర్తి పొందిన వాళ్లలో రాజమౌళి కూడా ఒకడు. దర్శకుడి విజన్ ఎంత గొప్పగా ఉంటే.. అంత గొప్ప సినిమాలు వస్తాయని శంకర్ రుజువు చేస్తే.. అదే బాటలో ప్రయాణించిన జక్కన్న శంకర్ కన్నా భారీ కలల్ని కని.. వాటిని వెండితెరపై అద్భుత రీతిలో ఆవిష్కరించాడు. బాహుబలి తో అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు.

రాజమౌళి ఎదుగుదల చూసి శంకర్ డిఫెన్స్ లో పడిపోయాడని.. అతడిని చూసి అసూచ చెందుతూ ఉంటాడని సోషల్ మీడియాలో డిస్కషన్ నడుస్తుంటే.. శంకర్ మాత్రం ఓపెన్ మైండ్ తో రాజమౌళిని అభినందించడం విశేషం. బాహుబలి-2 భారతీయ సినిమాకు గర్వకారణం. ఎంత ధైర్యం.. ఎంత అందం.. ఎంత భారీతనం.. ఎంత గొప్ప మ్యాజిక్ .. రాజమౌళికి అతడి టీంకు హ్యాట్సాఫ్ అని శంకర్ ట్వీట్ చేయడం విశేషం. రాజమౌళి అనే పేరులో రాజ కు కోట్స్ పెట్టడం అంటే ఇప్పుడున్న దర్శకుల్లో రాజమౌళి కింగ్ అని శంకరే స్వయంగా ఒప్పుకున్నట్లే భావించాలి. మరోవైపు సూపర్ స్టార్ రజినీకాంత్ సైతం రాజమౌళి గురించి గొప్పగా మాట్లాడాడు. రజినీ కూడా బాహుబలి-2 ఇండియన్ సినిమాకు గర్వకారణం అన్నాడు.

,  ,  ,  ,