Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

01-Jun-2016 17:25:45
facebook Twitter Googleplus
Photo

సుకుమార్ సినిమాలకు సంబంధించిన సంగతులంటే జనాలకు భలే ఆసక్తి. ఇంతకుముందు కేవలం దర్శకుడిగా మాత్రమే సినిమాలు చేసేవాడు. ఈ మధ్య రచయితగా.. నిర్మాతగా కూడా మారి.. ?కుమారి 21 ఎఫ్? సినిమా తీశాడు. అది మంచి ఫలితాన్నిచ్చింది. దీని తర్వాత సుకుమార్ స్క్రిప్టు అందించే.. నిర్మించే.. దర్శకత్వం వహించే సినిమాల గురించి ఆసక్తికర కబుర్లు వినిపిస్తున్నాయి టాలీవుడ్లో. మరోవైపు సుకుమార్ తన అన్న కొడుకును హీరోగా పరిచయం చేయబోతున్నట్లు కూడా చెబుతున్నారు. దీనిపై సుకుమారే స్వయంగా క్లారిటీ ఇచ్చాడు. తూర్పుగోదావరి జిల్లాలోని తన స్వగ్రామం మట్టపర్రుకు వెళ్లిన ఆయన.. అక్కడ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ తన ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి వెల్లడించాడు.

త్వరలో తన తండ్రి బండ్రెడ్డి తిరుపతినాయుడు పేరుతో ?బీటీఆర్ క్రియేషన్స్? బేనర్ మొదలుపెడుతున్నానని.. తన అన్నయ్య తనయుడు అశోక్ హీరోగా సినిమా తీస్తున్నానని సుకుమార్ వెల్లడించాడు. జూన్ 9న ఈ సినిమా షూటింగ్ మొదలవుతుందని.. దీనికి ?దర్శకుడు? అనే టైటిల్ నిర్ణయించామని సుక్కు తెలిపాడు. ?ఫర్ లవ్ హిజ్ ఫ్యాషన్? అని ట్యాగ్ లైన్ అనుకుంటున్నట్లు చెప్పాడు. ?అంతకు ముందు ఆ తరువాత? ఫేమ్ ఈషా కథానాయికగా నటిస్తుందని.. హరిప్రసాద్ దర్శకత్వం వహిస్తాడని కూడా తెలిపాడు. ఇక తన దర్శకత్వంలో రాబోయే సినిమాకు స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని.. త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తానని సుక్కు చెప్పాడు. రామ్ చరణ్ హీరోగా ?ఫార్ములా ఎక్స్? పేరుతో సుక్కు తన తర్వాతి సినిమా తీయబోతున్నట్లు వార్తలొస్తున్న సంగతి తెలిసిందే.

,  ,  ,  ,  ,  ,