Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

21-Oct-2015 16:44:23
facebook Twitter Googleplus
Photo

హీరోల్ని దర్శకులు పొగడ్డం కొత్తేమీ కాదు. ఐతే కమర్షియల్ డైరెక్టర్లు తమ హీరోల్ని పొగడ్డంలో ఆశ్చర్యమేమీ లేదు కానీ.. క్రిష్ లాంటి వాడు కూడా తన హీరోను అదే పనిగా పొగిడేస్తుండటమే ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇప్పటిదాకా తన సినిమాల్లో ఏ హీరోను పొగడని విధంగా ?కంచె? కథానాయకుడు వరుణ్ తేజ్ ను ఆకాశానికెత్తేస్తున్నాడు క్రిష్.

మరీ వరుణ్ పై అలా పొగడ్తలు గుప్పించేస్తున్నారేంటి అని క్రిష్ ను అడిగితే.. ??ఇప్పుడు నేను పొగుడుతున్నాను. కానీ సినిమా చూశాక జనాలు కూడా వరుణ్ గురించి అలాగే మాట్లాడుకుంటారు. మామూలుగా మంచి సినిమా తీస్తే ముందు దర్శకుడి గురించే చర్చ జరుగుతుంది. కంచె కూడా మంచి సినిమానే. కానీ సినిమా చూశాక ముందు వరుణ్ గురించి మాట్లాడి ఆ తర్వాతే నా దగ్గరికి వస్తారు. అంత అద్భుతంగా నటించాడు వరుణ్. అతడి కళ్లలో అంత ఇంటెన్సిటీ ఉంది. నటనలోనూ అంత ఇంటెన్సిటీ చూపించాడు. వరుణ్ కచ్చితంగా రేపటి తరం మంచి నటుల్లో ఒకడవుతాడు?? అని క్రిష్ చెప్పాడు.

వరుణ్ లాంటి అప్ కమింగ్ హీరో మీద 20 కోట్ల బడ్జెట్ పెట్టడం గురించి క్రిష్ చెబుతూ.. ??వరుణ్ కు ఇది రెండో సినిమా అన్న సంగతి మరిచిపోండి. నిజానికి ఈ సినిమాకు నేను ఖర్చు చేసింది చాలా తక్కువ. ఇంకా ఎక్కువే పెట్టాలి. కానీ నా దగ్గర అంత బడ్జెట్ లేదు. కానీ ఎంతలో తీశామన్నది కాదు ఎంత ఇంపాక్ట్ వేసిందన్నది ముఖ్యం. కంచె అలాంటి ఇంపాక్ట్ కచ్చితంగా వేస్తుంది?? అన్నాడు.

,  ,  ,  ,